Kangaroos Fighting Video: మనుషుల్లా కొట్టుకుంటున్న కంగారూలు, వీడియో వైరల్

Kangaroos Fighting Video: ఇటీవలి కాలంలో ప్రతి చిన్న వీడియో సోషల్ మీడియాలో వచ్చేస్తోంది. అందులో కాస్త ప్రత్యేకత ఉంటే ఇక అంతే..వైరల్ అవుతుంటుంది. అలాంటిదే ఈ వీడియో. ఎవరైనా ఎప్పుడైనా రెండు కంగారూలు మనుషుల్లా కొట్టుకోవడం చూశారా...

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 29, 2024, 08:45 PM IST
Kangaroos Fighting Video: మనుషుల్లా కొట్టుకుంటున్న కంగారూలు, వీడియో వైరల్

Kangaroos Fighting Video: సోషల్ మీడియా ప్రాచుర్యంలో వచ్చిన తరువాత వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. విభిన్నమైన కంటెంట్ కలిగిన వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. ప్రతి ఒక్కరూ షేర్ చేస్తుంటారు. ప్రతిరోజూ ఈ తరహా వందలాది వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. 

వైరల్ అయ్యే వీడియోల్లో సాధారణంగా ఎక్కువగా జంతువులవే ఉంటుంటాయి. ముఖ్యంగా పాముల వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఈసారి ప్రపంచంలో అరుదైన జంతువులుగా భావించే కంగారూల వీడియో తెగ వైరల్ అవుతోంది. అంతగా ఏముందనుకుంటున్నారా..రెండు కంగారూలు పరస్పరం కొట్టుకుంటున్న వీడియో ఇది. ఎవరు ఎలా షూట్ చేశారో తెలియదు కానీ అచ్చం మనుషులు కొట్టుకొంటున్నట్టే కొట్టుకుంటున్నాయి. 

ఇదొక పార్క్‌లో షూట్ చేసిన వీడియో. ఈ పార్క్ లో రెండు కంగారూలు నిలుచున్నాయి. రెండూ ఏదో బరిలో దిగేందుకు సిద్ధమైనట్టే ఒకదానికొకటి చూసుకుంటాయి. అంతే సడెన్‌గా ఫైటింగ్ ప్రారంభిస్తాయి. అది కూడా ఎలాగంటే అచ్చం మనుషులు కొట్టుకున్నట్టే. కాళ్లతో ఎగిరి కొట్టడం, చేతులతో ఒకదాని పీక మరొకటి పట్టుకోవడం. రెండూు ఎక్కడా తగ్గేది లే అంటూ కొట్టుకుంటాయి. ఈ వీడియో అసలైందే గానీ ఫన్ కోసం ఈ వీడియోలో కొట్టుకునేటప్పుడు కాస్త సౌండ్ ఎఫెక్ట్ జత చేశారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 🔹 𝕭𝖎𝖑𝖆𝖑 🌾 (@bilal.ahm4d)

మొదట ఎక్స్‌లో పోస్ట్ అయిన ఈ వీడియోను పెద్దఎత్తున వీక్షించారు. ఆ తరువాత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ కాగానే వైరల్ కాసాగింది. అచ్చం మనుషుల్లానే కొట్టుకుంటున్న కంగారూల వీడియో అందుకే వైరల్ అవుతోంది. 

Also read: Doctors Surgery: కాలికి గాయమైతే ప్రైవేటు పార్ట్‌కు శస్త్ర చికిత్స.. వైద్యుల ఘన కార్యం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News