Free Wifi Anywhere: ఫేస్‌బుక్‌ తో 'ఫ్రీ ఇంటర్నెట్'.. ఈ ట్రిక్ ఫాలో అయితే చాలు ఎక్కడైనా ఫ్రీ వైఫై పొందొచ్చు

Free Wifi Anywhere: సడెన్‌గా మీ మొబైల్ ఇంటర్నెట్ డేటా అయిపోయిందా... డైలీ డేటా లిమిట్ దాటిందా... దానికి మీరు పెద్దగా వర్రీ అవాల్సిన పని లేదు. ఈ ట్రిక్‌తో మీరు ఎక్కడైనా సరే ఉచిత వైఫై యాక్సెస్‌ని పొందవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2022, 11:23 AM IST
  • సడెన్‌గా ఇంటర్నెట్ డేటా అయిపోయిందా
  • డోంట్ వర్రీ... ఎక్కడైనా సరే మీరు ఫ్రీ వైఫై యాక్సెస్ పొందవచ్చు
  • ఈ ట్రిక్ ఫాలో అయితే ఫ్రీ వైఫై యాక్సెస్‌ను గుర్తించడం సులువు
Free Wifi Anywhere: ఫేస్‌బుక్‌ తో 'ఫ్రీ ఇంటర్నెట్'.. ఈ ట్రిక్ ఫాలో అయితే చాలు ఎక్కడైనా ఫ్రీ వైఫై పొందొచ్చు

Free Wifi Anywhere: షాపింగైనా, మూవీ టికెట్స్ బుకింగైనా, కొత్త సినిమాల స్ట్రీమింగ్ అయినా, ఏవైనా బిల్లులు చెల్లించాలన్నా... ఇలాంటివన్నీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ సహాయంతో ఇంట్లో నుంచే కానిచ్చేయొచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ప్రతీది డిజిటల్‌లోకి మారుతోంది. దీంతో మొబైల్ యూజర్స్ డేటా వినియోగం కూడా పెరుగుతోంది. అందుకు తగినట్లే టెలికాం సంస్థలు వివిధ ప్లాన్స్‌తో డేటా ప్యాకేజీలను అందిస్తున్నాయి. ఎంత డేటా ప్యాకేజీ ప్లాన్స్ వినియోగించినా... ఒక్కోసారి సడెన్‌గా డేటా అయిపోతే ఏం చేయాలో తోచదు. అయితే దానికి మీరు పెద్దగా చింతించాల్సిన పని లేదు. ఫేస్‌బుక్ ద్వారా మీకు సమీపంలోని ఉచిత వైఫై హాట్ స్పాట్‌ను గుర్తించి.. దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం... 

ఫేస్‌బుక్‌ ద్వారా 'ఉచిత వైఫై' :

ఫేస్‌బుక్ ద్వారా మీకు సమీపంలోని ఉచిత వైఫై హాట్‌స్పాట్స్‌ను సులువుగా గుర్తించవచ్చు. దానికి మీ ఫోన్‌ని కనెక్ట్ చేయడం ద్వారా ఉచిత ఇంటర్నెట్‌ని పొందవచ్చు. దీని కోసం ఫేస్‌బుక్ మినహా ఏ ఇతర యాప్ అవసరం లేదు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

ఇలా చేస్తే 'ఫ్రీ' వైఫై ఉపయోగించుకోవచ్చు :

1) మొదట మీ మొబైల్ ఫోన్‌లో ఫేస్‌బుక్ యాప్ ఓపెన్ చేయండి.
2) అక్కడ ఎగువ భాగంలో కుడివైపున ఉన్న మెనూపై క్లిక్ చేయండి
3) ఇప్పుడు సెట్టింగ్, ఆపై ప్రైవసీ ఆప్షన్‌ని ఎంచుకోండి
4) అక్కడ మీకు 'Find Wifi' ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
5) ఇప్పుడు మీ మొబైల్ డిస్‌ప్లేపై పబ్లిక్ వైఫై హాట్‌స్పాట్స్ సమాచారం కనిపిస్తుంది.
6) అక్కడే 'సీ మోర్' అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మరిన్ని పబ్లిక్ వైఫై హాట్‌స్పాట్స్ కనిపిస్తాయి.
7) ఒకవేళ మీకు సమీపంలో ఏవైనా ఉచిత వైఫై హాట్‌స్పాట్స్ ఉంటే... అవి కూడా స్క్రీన్‌పై మీకు కనిపిస్తాయి.
8) ఆ ఉచిత వైఫై హాట్‌స్పాట్స్‌ను కనెక్ట్ చేసుకుంటే ఉచితంగా వైఫై పొందగలరు.

ఇలా ఫేస్‌బుక్ యాప్‌ని ఉపయోగించి మీరెక్కడి నుంచైనా ఉచిత వైఫై హాట్‌స్పాట్స్‌ను గుర్తించి ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు. 

Also Read: Covid 19: పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై కరోనా ఎఫెక్ట్.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు

Also Read: Find My Device: దొంగిలించిన స్మార్ట్ ఫోన్ ను ట్రాక్ చేయడం ఎలానో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News