Funny Viral News: డ్రైవింగ్ కూడా తెలియకుండానే వ్యాన్ ఎత్తుకెళ్లారు.. ఏం జరిగిందో తెలిస్తే కడుపుబ్బా నవ్వడం పక్కా..

వాహనాలు చోరీ చేసి, వాటిని అమ్మేయగా వచ్చిన డబ్బులను అందరూ కలిసి పంచుకోవాలి అనేది వారి ప్లాన్. చోరీ చేసిన వాహనాలను మార్కెట్లో అమ్మేయాలి.. ఒకవేళ అక్కడ అమ్మడం కుదరకపోతే ఎలా అనే ఆలోచన వారిని ఒక వెబ్‌సైట్ కూడా తయారు చేసుకునేలా చేసింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే.. మీరు కూడా కడుపుబ్బా నవ్వుకోవడం పక్కా. 

Written by - Pavan | Last Updated : May 24, 2023, 09:46 PM IST
Funny Viral News: డ్రైవింగ్ కూడా తెలియకుండానే వ్యాన్ ఎత్తుకెళ్లారు.. ఏం జరిగిందో తెలిస్తే కడుపుబ్బా నవ్వడం పక్కా..

Funny Viral News About Van Theft: ఇదొక ఫన్నీ న్యూస్... కొత్తగా చోరీలు చేయడం మొదలుపెట్టిన ముగ్గురు దొంగల ముఠా.. ఆదిలోనే పెద్ద పొరపాటు చేసి అడ్డంగా పోలీసులకు పట్టుబడింది. అసలు ఏం జరిగిందో తెలిస్తే.. మీరు కూడా కడుపుబ్బా నవ్వుకోవడం పక్కా. ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. సత్యం కుమార్ అనే ఒక బీటెక్ స్టూడెంట్, అమన్ గౌతం అనే బీకాం పైనల్ ఇయర్ స్టూడెంట్, అమిత్ వర్మ అనే మరో యువకుడు కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠా చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజెన్స్‌కి నవ్వుకోవడానికి మంచి ఎంటర్‌టైన్మెంట్ దొరికినట్టయింది.

వాహనాలు చోరీ చేసి, వాటిని అమ్మేయగా వచ్చిన డబ్బులను అందరూ కలిసి పంచుకోవాలి అనేది వారి ప్లాన్. చోరీ చేసిన వాహనాలను మార్కెట్లో అమ్మేయాలి.. ఒకవేళ అక్కడ అమ్మడం కుదరకపోతే ఎలా అనే ఆలోచన వారిని ఒక వెబ్‌సైట్ కూడా తయారు చేసుకునేలా చేసింది. బీటెక్ చదువుతున్న సత్యం కుమార్ ఆ బాధ్యత తీసుకున్నాడు. అందుకోసం ఒక వెబ్ సైట్ కూడా తయారవుతోంది.

ముందుగా ప్లాన్ చేసుకున్నదాని ప్రకారమే ఒక వ్యాన్ ని దొంగిలించిన ఈ దొంగల ముఠాకు.. అసలు సమస్య ఆ వాహనాన్ని చోరీ చేశాకే ఎదురైంది. అదేంటంటే.. ఆ ముగ్గురిలో ఎవ్వరికి కూడా వాహనం డ్రైవింగ్ చేయడం రాదు. తమలో ఎవ్వరికి కూడా డ్రైవింగ్ రాదు అనే విషయం అప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఏం చేయాలో అర్థం కాక.. ఆ వాహనాన్ని అలాగే 10 కిమీ వరకు ముగ్గురూ కలిసి నెట్టుకుంటూ తీసుకెళ్లి ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టారు. 

చోరీ చేసిన వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లినా పట్టుకునేలా అత్యాధునిక టెక్నాలజీ వచ్చిన ఈ రోజుల్లో వీళ్లు వాహనాన్ని పబ్లిక్ అంతా చూస్తుండగా అలా 10 కిమీ నెట్టుకుంటూ వెళ్తే పట్టుబడకుండా ఉంటారా చెప్పండి.. ఈ విషయం ఎలాగోలా పోలీసులకు తెలిసిపోయింది. వారి దొంగతనం బయటపడింది. కాన్పూర్ లోని బేజ్ ఏసీపీ నారాయణ్ సింగ్ ఈ ముగ్గురు సభ్యుల చోరీ ముఠా వివరాలను మీడియాకు వెల్లడించారు. చోరీ చేసిన వాహనాలను మార్కెట్లో అమ్మేయాలన్న ప్లాన్ తప్పించి.. అసలు తమలో ఎవరికైనా డ్రైవింగ్ చేయడం వచ్చా అనే ఆలోచన కూడా చేయని వీళ్లని ఫెయిల్యూర్స్ అనాలో లేక అమాయకులు అనాలో కూడా అర్థం కావడం లేదు అని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు ఏమంటారో అనేది ఈ వార్తా కథనం కింద కామెంట్ చేయండి.

Trending News