Man Saves Cat Viral Video: నైరుతి ఫ్లోరిడాలో వర్షాల కారణంగా ఎప్పుడు వరదలు వస్తూనే ఉంటాయి. కొన్ని ప్రాంతాలు అయితే తరచుగా నీటిలోనే మునిగి ఉంటాయి. అయితే ప్రస్తుతం ఫ్లోరిడాలో బీభత్సమైన వర్షాల కారణంగా పలు ప్రాంతాలన్నీ జలమయంలో మునిగిపోయాయి. అక్కడి వారంతా నీటిలోనే జీవనం సాగిస్తున్నారు. ఆ దేశ ప్రభుత్వం సహాయం ప్రకటించినప్పటికీ ఇంత వారికి వరదల్లో చిక్కుకున్న వారికి ఎలాంటి సహకారాలు లభించలేవని ప్రచారం. అయితే నైరుతి ఫ్లోరిడాలోని వరదలకు సంబంధించిన కొన్ని వీడియోలు మనం నెట్టింట్లో చూసి ఉంటాం. ఇందులో ఓ యువకుడు వరదల్లో చిక్కుకుపోయిన పిల్లిని రక్షించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.
ఇక ఆ వీడియో విషయానికొస్తే.. నైరుతి ఫ్లోరిడాలోని ఓ ప్రాంతంలోని నివసిస్తున్న యువకుడు తన ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా వరద ప్రవాహం ఉద్రిక్తంగా ఉండంగా తన పెంపుడు పిల్లి అయినా స్కావో రక్షించుకున్నాడు. అయితే ఈ వీడియోని చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోయారు. మరికొందరైతే " ఆ యువకుడు ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా ఎంతో ప్రేమ కొద్ది చూసుకుంటున్న ఆ పెంపుడు పిల్లిని రక్షించడం అందరి మనుషుల్ని దోచేసింది" అంటూ కామెంట్స్ కూడా చేశారు.
My boyfriend saving a cat from flood waters near Bonita Beach. #HurricaneIan #Naples #Bonita #FortMyers pic.twitter.com/BlBC9P1rdy
— Megan Cruz Scavo (@MeganScavo) September 28, 2022
మీరు ఈ వీడియోలో గమనించినట్లయితే ఏడతెరిపిలేని వర్షంలో వరదలు వస్తున్న ఆయన ఏ మాత్రం లెక్కచేయకుండా.. మోకాలి లోతు నీటిలో చిక్కుకుపోయిన పిల్లిని రక్షించి..వార్తల్లో నిలిచాడు.
భారీ వర్షాల కారణంగా అతని ఇల్లు వరదల్లో 10 అడుగుల లోతు మునిగిపోయిందని..దీంతో అతని తల్లిదండ్రులు పిల్లి ఇంట్లోకి రాకపోవడం గమనించి ఆ యువకునికి చెప్పగా..పిల్లి కోసం గాలింపు చర్యలు చేపట్టాడు. దీంతో ఆ పెళ్లి ఓ బాక్స్ పై నిలబడి ఉండడం చూసి వరదలను సైతం లెక్కచేయకుండా పిల్లి దగ్గరికి చేరుకొని రక్షించాడు. ఈ వీడియోను తన ట్విటర్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిని ఇప్పటిదాకా ట్విట్టర్లో 3.4 మిలియన్ల మంది వీక్షించారు.
Also Read: Dussehra 2022: దసరా రోజు ఆయుధ పూజలో భాగంగా ఇలా చేయండి.. మీరు కోరిన కోరికలు తీరుతాయి..
Also Read: Dussehra 2022: శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook