Elephant Viral Video: పిల్లలకు ఏ ఇబ్బంది కలిగినా తల్లి మనసు తల్లడిల్లుతుంది. దీనికి నిదర్శనమే ఈ వీడియో. దీనిని ఐఎఫ్ఎస్ ( IFS ) అధికారి సుధా రామెన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో తల్లి ఏనుగు ( Mother Elephant ) పిల్ల ఏనుగుకు జీవితాంతం ఉపయోగపడే టెక్నిక్‌ను నేర్ఫించడాన్ని చూడవచ్చు. ఒక ఏనుగు కుటుంబం రోడ్డు ( Elephant Crossing Road) దాటుతుండగా మధ్యలో డివైడర్ అడ్డం వచ్చింది. అయితే పెద్ద ఏనుగులు తమకు అలవాటే అన్నట్టుగా డివైడర్‌ను క్షణాల్లో దాటేశాయి. అయితే ఆ కుటుంబంలో చిన్నారి పిల్ల ఏనుగు మాత్రం ఈ డివైడర్‌ను దాటడానికి ఇబ్బంది పడింది. ఏం చేయాలో అర్థం కాకపోవడంతో కాసేపు అటూ ఇటూ తిరిగింది. అది గమనించిన తల్లి ఏనుగు చిన్నారి ఏనుగు పిల్ల దగ్గరకు వచ్చి.. అలా కాదమ్మా.. ఇలా ఎక్కాలి అని చేసి చూపించింది. Also Read : Corona virus: ఏపీ, తెలంగాణ సీఎం నివాసాలకు చేరిన కరోనా వైరస్
This little Elephant calf was blessed to get the help from its mother. Not every animal are that lucky. Such structures are also the reason for roadkills. High time to rethink& plan animal friendly linear projects that pass through d forests& corridors. Video shared by an officer pic.twitter.com/USAcWizJYZ
— Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) July 3, 2020
తల్లి ఏనుగు చెప్పిన విధంగా ప్రయత్నించింది ఆ చిన్నారి ఏనుగు. అయినా కానీ డివైడర్‌ను ఎక్కలేకపోయింది. అది గమనించి తల్లి తొండంతో పైకి నెట్టి డివైడర్ను దాటడంలో సహకరించింది. ఈ వీడియోలో తల్లి ప్రేమతో పాటు మూగజీవాల తెలివితేటలను నెటిజన్లు ( Netizens ) తెగపొగిడేస్తున్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..