వివిధ సందర్భాల్లో ఏనుగులు స్పందించే తీరు ఎలా ఉంటుందనేది మీరు అనేక వీడియోల్లో చూసే ఉంటారు. ఏనుగులకు ఆగ్రహం వస్తే విధ్వంసం సృష్టిస్తాయి. వాటి కళ్లకు కనిపించిన ప్రతీ దాన్ని తొక్కిపారేస్తాయి. అటు ఇటు దొర్లించేస్తాయి. అడ్డొస్తే మనుషులనైనా తొక్కి చంపుతాయి. అలాగే వాటికి కోపం రాకుండా సాధారణంగా ఉన్నప్పుడైతే.. మనుషులతో మమేకమైపోతాయి.
సోషల్ మీడియాలో ( Social Media ) ప్రస్తుతం ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక తల్లి ఏనుగు పిల్ల ఏనుగుతో పాటు కనిపిస్తుంది. తన పిల్లను కవర్ చేయడానికి అది చేసే ప్రయత్నం కనిపిస్తుంది.
పిల్లలకు ఏ ఇబ్బంది కలిగినా తల్లి మనసు తల్లడిల్లుతుంది. దీనికి నిదర్శనమే ఈ వీడియో. దీనిని ఐఎఫ్ఎస్ ( IFS ) అధికారి సుధా రామెన్ తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో తల్లి ఏనుగు ( Mother Elephant ) పిల్ల ఏనుగుకు జీవితాంతం ఉపయోగపడే టెక్నిక్‌ను నేర్ఫించడాన్ని చూడవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.