Beautiful Hand writing: కంప్యూటర్‌ ఫాంట్‌ కంటే అందమైన చేతిరాత ఆమెదేనాట..ఆ హ్యాండ్ రైటింగ్ మీరు చూడండి..

Viral Beautiful Hand writing: మీరు ఎప్పుడైన కంప్యూటర్‌ ఫాంట్‌ కంటే అదమైన హ్యాండ్ రైటింగ్ చూశారా.? నేపాల్‌లోని ఓ విద్యార్థిని ఎంతో అందమైన చేతి రాత ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె రైటింగ్‌ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2023, 04:32 PM IST
Beautiful Hand writing: కంప్యూటర్‌ ఫాంట్‌ కంటే అందమైన చేతిరాత ఆమెదేనాట..ఆ హ్యాండ్ రైటింగ్ మీరు చూడండి..

 

Viral Beautiful Hand writing: గతంలో విద్యార్థులకు చేతి రాతను బట్టి కూడా మార్కులు ఉండేవి..మంచి చేతి రాత కాలిన వారికి అదనపు మార్కలు కూడా వేసేవారు. అంతేకాకుండా వీరు టీచర్స్‌ దృష్టిని కూడా ఆకర్షిస్తారు. అయితే కొంతమంది చేతి రాత బాగున్నప్పటికీ చదవడంలో చాలా పూర్‌ ఉంటారు. మరికొందరైతే బాగా చదివినప్పటికీ చేతిరాత బాగుండదు. మీరు ఎప్పుడైనా ప్రపంచంలో అత్యంత అందమైన చేతిరాత ఎవరిదో తెలుసా..ఈ రాతపైకి కంప్యూటర్‌ ఫాంట్‌ కూడా పనికరాదు. 

నేపాల్‌లోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థిని హ్యాండ్ రైటింగ్ ప్రపంచంలోనే చాలా అందంగా ఉంటుంది. మల్లా అనే విద్యార్థిని ప్రపంచంలోని అత్యంత అందమైన చేతిరాతతో వార్తల్లో నిలవడంతో ఆమెను అందరూ అభినందిస్తున్నారు. ఆమె చేతి రాతపై కంప్యూటర్‌లో ఉండే ఫాంట్‌ కూడా పోటీ పడలేదని స్థానికులు చెప్పుకుంటారు. అతి చిన్న వయసులోనే మల్లా మంచి గుర్తింపు సాధించడం వల్ల తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

ప్రస్తుతం మల్లా నేపాల్‌లోని సైనిక్ వాస్య మహావిద్యాలయంలో టెన్త్‌ క్లాస్‌ చదువుతోంది. అయితే టీచర్స్‌ చెప్పిన లెస్సన్స్‌ ప్రతి రోజు హోమ్‌ వర్క్‌ ద్వారా రాసేది. ప్రతి రోజు రాసే హోమ్‌ వర్క్‌ను టీచర్స్‌ చూసి మల్లాను మెచ్చుకునేవారు. 10వ తరగతి చివరి పరీక్షల్లో అధికారులు ఆమె హ్యాండ్ రైటింగ్ చూసి ఎంతో అభినందించారు. ప్రస్తుతం విద్యార్థిని మల్లా చేతి రాత నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

ఆమె చేతిరాతను చూసి నెటిజన్స్‌  ప్రశంసలు కురిపిస్తున్నారు. మల్లా చేతి రాత ఫోటోస్‌ నెటిజన్లు లైక్‌లు, కామెంట్లు కురిపిస్తున్నారు. దీంతో పాటు ఆ రాతను చూసి నిపుణులు సైతం ఆశ్యర్యపోతున్నారాంటే మీరు కూడా చూడాల్సిందే. మల్లా రాసిన రాతలు అచ్చం కంప్యూటర్‌ టైప్‌ చేసిన్నట్లుగానే ఉందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమె రాతలు నేపాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమమైన హ్యాండ్ రైటింగ్ నిలిచింది. అయితే ఆమె చేతి రాతలను నేపాల్ ప్రభుత్వం గుర్తించి..అవార్డులతో సత్కరించింది. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News