Optical Illusion: ఈ చిత్రంలో సింహం ఎక్కడుందో 5 సెకన్లలో కనిపెట్టగలరా.. కనిపెడితే మీరు పక్కా జీనియస్..

Optical Illusion Hidden Lion in Viral Photo: ఇక్కడ కనిపించే చిత్రం.. ఆఫ్రికాకు చెందిన ఓ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఇందులో సింహం ఎక్కడ దాగుందో గుర్తించండి చూద్దాం..

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 7, 2022, 02:15 PM IST
  • ఆప్టికల్ ఇల్యూజన్
  • ఈ చిత్రంలో సింహాన్ని గుర్తించగలరా
  • 5 సెకన్లలో గుర్తించగలిగితే మీరు చాలా జీనియస్
Optical Illusion: ఈ చిత్రంలో సింహం ఎక్కడుందో 5 సెకన్లలో కనిపెట్టగలరా.. కనిపెడితే మీరు పక్కా జీనియస్..

Optical Illusion Hidden Lion in Viral Photo: ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ కంటికి, మెదడుకు పరీక్ష పెడుతాయి. మీ కళ్లు, మెదడు ఎంత చురుగ్గా పనిచేస్తే అంత త్వరగా ఆప్టికల్ ఇల్యూజషన్స్‌లో దాగున్న చిత్రాలను గుర్తించగలరు. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటోగ్రాఫర్ తీసిన చిత్రం వైరల్ అవుతోంది. అందులో ఒకచోట సింహం దాగి ఉంది. ఆ సింహాన్ని మీరు 5 సెకన్లలో గుర్తించగలిగితే చాలా జీనియస్.. మరింకెందుకు ఆలస్యం వెంటనే ప్రయత్నించండి..

ఆఫ్రికాలో తీసిన ఫోటో ఇది :

ఆఫ్రికా దేశం టాంజానియాలోని సెరెంగెటీ నేషనల్ పార్క్‌లో 'మార్క్ డ్రైస్‌డేల్‌' అనే ఫోటోగ్రాఫర్ ఈ  చిత్రాన్ని తన కెమెరాలో బంధించాడు. ఆకాశంలో మేఘాలు, పచ్చగా పరుచుకున్న గడ్డి, పెద్ద బండరాళ్లను అందులో గమనించవచ్చు. ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి తేలిగ్గా గుర్తించవచ్చు. అయితే ఇదే చిత్రంలో కనిపించీ కనిపించనట్లు ఒకచోట సింహం దాగుంది. 

సింహాన్ని గుర్తించేందుకు మీకొక క్లూ కూడా ఇస్తున్నాం. మీరు సింహం వైపు నుంచి ఆలోచిస్తే అది ఎక్కడుందో ఇట్టే పసిగట్టగలరు. అంటే.. ఏ ప్రదేశంలో దాగుని ఉంటే ఇతర జంతువులకు కనబడకుండా ఒక్కసారిగా దాడి చేసే అవకాశం ఉంటుందో కాస్త ఆలోచించండి. 

ఇప్పటికీ ఆ సింహాన్ని గుర్తించలేకపోయారా.. అయితే ఇక కష్టపడకండి. ఆ సింహం ఎక్కడ దాగుందో కింది చిత్రంలో గమనించండి. ఇటీవలి కాలంలో ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రాలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. 

Also Read: Warangal MGM: వరంగల్‌ ఎంజీఎంలో అనూహ్య ఘటన.. సర్జరీకి మత్తు ఇస్తుండగా కార్డియాక్ అరెస్ట్‌తో బాలుడి మృతి..

Also Read:  Optical Illusion IQ Test: ఈ చిత్రంలో దాగున్న పిల్లులను 30 సెకన్లలో గుర్తించగలరా.. ట్రై చేయండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News