Optical Illusion Pic: కన్పించేదేదీ వాస్తవం కాదు. కొన్ని ఫోటోలు మభ్యపెడుతుంటాయి. మరికొన్ని మాయ చేస్తుంటాయి. అటువంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటో ఒకటి అంతుచిక్కకుండా ఉంది. ఆ మిస్టరీ మీరు ఛేదించగలరా..
సోషల్ మీడియాలో చాలా రకాల ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు షేర్ అవుతుంటాయి. ఇందులో కొన్ని సాల్వ్ చేయలేక చేతులెత్తేసే పరిస్థితి ఉంటుంది. అలాంటిదే ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటో ఇది.
ఇక్కడ కన్పిస్తున్న ఫోటో ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించింది. అంటే అంతా కన్పిస్తున్నట్టే ఉంటుంది. అసలైంది కన్పించదు. మభ్యపెడుతుంటుంది. ఇందులో కొద్దిగా సస్పెన్స్ కూడా ఉంది. ఈ ఫోటోలో మహిళను హత్య చేసిన మర్డరర్ను గుర్తుపట్టగలరా..అదే ఈ ఫోటోలోని మిస్టరీ..
ఈ ఫోటోలో మీకు ఒక రెస్టారెంట్ కన్పిస్తుంది. ఆ రెస్టారెంట్ బాత్రూమ్లో ఓ మహిళ మృతదేహం పడుంది. మీరు చేయాల్సిందల్లా హంతకుడెవరో తెలుసుకోవాలి. ఈ ఫోటోలో మర్డరర్ ఆచూకీని 10 సెకన్లలో కనిపెట్టగలగాలి. అదే మీ ఛాలెంజ్. ఈ ఫోటోను మామూలుగా చూస్తే తెలియదు. అదే పనిగా చూస్తే గానీ కిల్లర్ ఎవరనేది కనిపెట్టలేం.
మీకు సరైన సమాధానం లభించకపోతే మీ కోసం కొన్ని హింట్స్ అందిస్తున్నాం. ఇందులో ఉన్న ఐదుగురు అనుమానితుల్లో ఒకరి ముఖంపై 12 గంటలై ఉంది. ఇంకా నిశితంగా పరిశీలిస్తే..మృతురాలి చేతిలో ఒకరి చొక్కా చిరిగిన ముక్క ఉంది. ఇప్పుడు కూడా మీకు తెలియకపోతే..దిగువన ఉన్న ఫోటోలో చూడవచ్చు.
పై ఫోటోలోని నెంబర్ 4 వ్యక్తి ఆ మహిళను చంపిన హంతకుడు. అతడి మెడపై గుర్తు ఉంది. రెస్ట్ రూమ్‌కు అత్యంత సమీపంలో ఉన్నది కూడా అతడే. అతడి టేబుల్‌పై కత్తి కన్పించడం లేదు. మృతురాలి చేతిలో ఉన్న షర్ట్ చిరిగిన ముక్క రంగు ఈ వ్యక్తి చొక్కా ఒకటే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook