Trending Video | పాకిస్తాన్లో కొత్త ట్రెడిషన్ స్టార్టయింది. జనరల్ గా పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు అల్లుల్లకు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తుంటాము. కానీ పాక్‌లో మాత్రం కొత్త కల్చర్ ప్రారంభం అయింది. అత్త నుంచి అల్లు అల్లుడికి ఏకే-47 రైఫిల్ గిఫ్టుగా అందింది. అది చూసి పెళ్లికొడుకు షాక్ అవుతాడేమో అనుకుంటున్నారా ? లేద ఎలాంటి మొహమాటలం లేకుండా నవ్వుతూ గిఫ్ట్ తీసుకున్నాడు.
Also Read | Telugu Memes: గ్రేటర్ ఎన్నికల్లో తక్కువ పోలింగ్, నెటిజెన్ల ట్రోలింగ్
30 సెకన్ల ఈ వీడియోలో (Viral Video) చిరునవ్వు చిందిస్తూ పెళ్లి కొడుకు ఏకే-47 రైఫిల్ తీసుకుంటాడు. మరి రైఫిల్‌ను చూసి పెళ్లికి వచ్చిన వాళ్లు టెన్షన్ పడ్డారేమో అనుకుంటున్నారా ? అస్సలు కాదు. ఆనందంతో కేరింతలు పెట్టారు. భర్తకు అలాంటి గిఫ్ట్ వచ్చినందుకు పెళ్లి కూతురు ఆశ్చర్యపోలేదు.. చిరునవ్వు నవ్వింది. ఈ వీడియోను పాకిస్తాన్ జర్నలిస్ట్ అదీల్ఖక అహ్సాన్ షేర్ చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social Media) బాగా వైరల్ అవుతోంది. పాకిస్తాన్లో గన్ను కల్చర్ ఎలా ఉందో.. ఆ దేశంలో ఉగ్రవాదం ఎలాంటి పరిస్థితిలో ఉందో ఈ వీడియోను చూసి అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నెటిజెన్స్.
Kalashnikov rifle as a wedding present pic.twitter.com/BTTYng5cQL
— Adeel Ahsan (@syedadeelahsan) November 25, 2020
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe