Dog Viral Video: ఈ కుక్క చేసే పని చూస్తే.. వావ్ అనకుండా ఉండలేరు!

Dog Funny Video, Dog washing clothes in Laundry. సీక్రెట్ ఇంట్లోని అన్ని పనులు చేస్తుంది. ఈ క్రమంలోనే బట్టలు ఉతకడంలో మేరీకి సహాయం చేసింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 9, 2022, 02:37 PM IST
  • ఈ కుక్క చేసే పని చూస్తే
  • వావ్ అనకుండా ఉండలేరు
  • ర్యాక్‌లో పెట్టడంలో కూడా
Dog  Viral Video: ఈ కుక్క చేసే పని చూస్తే.. వావ్ అనకుండా ఉండలేరు!

Dog washing clothes in Laundry and Helps Woman: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ కుక్కను ఇళ్లల్లో పెంచుకోవడం సర్వసాధారణం అయిపోయింది. దాదాపుగా ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటున్నారో లేదో తెలియదు కానీ.. కుక్కలు మాత్రం ఉంటున్నాయి. అంతలా కుక్కలకు, మనుషులకు మధ్య అనుబంధం ఏర్పడింది. విశ్వాసంకు మారుపేరైన కుక్కలు.. యజమానులను ఎంతో ప్రేమగా చేసుకుంటాయి. ఇంట్లో దొంగలు పడకుండా కూడా కాపలా కాస్తుంటాయి. అంతేకాదు ఇంటి పనిలో కూడా సహాయపడుతుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో ఓ కుక్క చేసే పని చూస్తే వావ్ అనాల్సిందే.

గతంలో ఓ యజమానురాలు, కుక్క కలిసి యోగా చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ అదే కుక్క, యజమాని వార్తల్లో నిలిచారు. నిజానికి ఈ వీడియో పాతదే అయినా.. పప్పీస్ అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో మరోసారి వైరల్ అయింది. వీడియోలో కనిపించే కుక్క పేరు సీక్రెట్ కాగా.. యజమానురాలు పేరు మేరీ. సీక్రెట్ ఇంట్లోని అన్ని పనులు చేస్తుంది. ఈ క్రమంలోనే బట్టలు ఉతకడంలో మేరీకి సహాయం చేసింది. కేవలం బట్టలు ఉతకడంలోనే కాదు బట్టలు ఆరిన తర్వాత వాటిని ర్యాక్‌లో పెట్టడంలో కూడా మేరీకి సహాయం చేసింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mary & Secret (@my_aussie_gal)

తన యజమాని మేరీ చేస్తున్నంత సేపు సీక్రెట్ లాండ్రీలో సమానంగా పనిచేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్ అయింది. ఈ వీడియోకి లైకుల కామెంట్ల వర్షం కురుస్తోంది. సూపర్ పప్పి ఒకరు కామెంట్ చేయగా.. సో క్యూట్ అని ఇంకొకరు ట్వీటారు. 'మేమిద్దరం కలిసి ఈరోజు ఉదయం లాండ్రీ పని చేశాం. నా ఫ్రెండ్‌తో కలిసి పని చేయడం చాలా అద్భుతంగా ఉంది’ అని ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టింది మేరీ.

Also Read:  Virat Kohli: జట్టులో చోటు కోసం యువకుల పోటీ.. విరాట్ కోహ్లీకి ఇదే చివరి అవకాశమా!

Also Read: Ravindra Jadeja: సీఎస్‌కేని వీడనున్న రవీంద్ర జడేజా.. బెంగళూరులోకి జడ్డు!  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News