Rhino Hit Truck: ట్రక్కును ఢీకొట్టిన ఖడ్గమృగం.. సహించేది లేదంటున్న అస్సాం సీఎం!

Viral Video, Rhino hit by truck in Haldibari. ఓ ఖడ్గమృగం అస్సాంలోని హల్దిబారి అటవీ ప్రాంతంలో రోడ్డుపై వెళుతున్న ట్రక్కును ఢీకొట్టింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 9, 2022, 08:13 PM IST
  • ట్రక్కును ఢీకొట్టిన ఖడ్గమృగం
  • సహించేది లేదంటున్న అస్సాం సీఎం
  • 20 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి
Rhino Hit Truck: ట్రక్కును ఢీకొట్టిన ఖడ్గమృగం.. సహించేది లేదంటున్న అస్సాం సీఎం!

Rhino hits truck at Haldibari Animal Corridor: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబందించిన చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం అయ్యో పాపం అనేలా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఖడ్గమృగం రోడ్డుపై వెళుతున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనపై అస్సాం సీఎం స్పందించారు. 

10 సెకెన్ల నిడివి గల వీడియో ప్రకారం... అస్సాంలోని హల్దిబారి అటవీ ప్రాంతంలో ఓ భారీ ఖడ్గమృగం అడవి లోపలి నుంచి పరుగెత్తుకుంటూ రోడ్డుపైకి వచ్చింది. అదే సమయంలో ఓ పెద్ద  ట్రక్కు అటు వైపుగా వెళుతోంది. రోడ్డుపైకి దూసుకొచ్చిన ఆ ఖడ్గమృగం ఒక్కసారిగా ట్రక్కును ఢీ కొట్టింది. ఢీకొట్టిన తర్వాత కిందపడిపోయిన ఖడ్గమృగం.. లేచి కాసేపు పరుగెత్తి మళ్లీ కింద పడిపోయింది. ఆపై మళ్లీ లేచి అడవిలోకి పరుగెత్తింది. 

ఖడ్గమృగం ట్రక్కును ఢీకొట్టిన వీడియోను అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. 'ఖడ్గమృగాలు మనుషులకు మంచి మిత్రులు. వాటికి హాని కలిగించే చర్యల్ని అస్సలు సహించబోము. హల్దిబారిలో జరిగిన ఈ ఘటన చాలా దురదృష్టకరం. వాహన డ్రైవర్‌కు జరిమానా విధించాం. వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా అసోంలోని కజిరంగ నేషనల్‌ పార్కు వద్ద 33 కిమీల మేర ప్రత్యేక ఎలివేటెడ్‌ కారిడార్‌ ఏర్పాటుపై పనిచేస్తున్నాము' అని అస్సాం సీఎం పేర్కొన్నారు. 

Also Read: కొండచిలువ కాటేసినా అస్సలు బెదరలేదు.. నీ ధైర్యానికి ఓ పెద్ద సలాం బాసూ!

Also Read: Old lady on Jr NTR: నువ్వు ఉంటే ఏంటి? చస్తే ఏంటి? ఎన్టీఆర్ పై వృద్ధురాలు షాకింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x