Python Viral Video: కొండచిలువ కాటేసినా అస్సలు బెదరలేదు.. నీ ధైర్యానికి ఓ పెద్ద సలాం బాసూ!

Viral Video, Big Python trying to bite man. కొండచిలువ మనుషులకు కనిపిస్తే ప్రాణభయంతో వణికిపోతారు. కానీ ఓ వ్యక్తి పూర్తి విరుద్ధంగా వ్యవహరించాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Oct 9, 2022, 03:58 PM IST
  • కొండచిలువ కాటేసినా అస్సలు బెదరలేదు
  • నీ ధైర్యానికి ఓ పెద్ద సలాం బాసూ
  • 10 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి
Python Viral Video: కొండచిలువ కాటేసినా అస్సలు బెదరలేదు.. నీ ధైర్యానికి ఓ పెద్ద సలాం బాసూ!

Python Man Viral Video, Big Python trying to bite man: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాములు ఒకటి. భయంకరమైన పాము జాతుల్లో కొండచిలువ ముందువరసలో ఉంటుంది. ఎంత పెద్ద జంతువు అయినా కొండచిలువకు భయపడాల్సిందే. ఎందుకంటే.. జంతువు చిన్నదా, పెద్దదా అని చూడకుండా అమాంతం మింగేస్తుంది. అలాంటి కొండచిలువ మనుషులకు కనిపిస్తే ఇంకేమన్నా ఉందా?.. ప్రాణభయంతో గజగజ వణికిపోతారు. కానీ ఓ వ్యక్తి అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించాడు. కొండచిలువ కాటేసినా అస్సలు బెదరలేదు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... ఓ వ్యక్తి పాములను పెంచుతుంటాడు. ఓ గదిలో చాలా పాములు ఉంటాయి. అందులో కొండచిలువ కూడా ఉంటుంది. దానికి ఆహారం పెట్టేందుకు ఆ వ్యక్తి బాక్స్ మీదున్న గుడ్డను తీసేసాడు. వెంటనే అది కోపంతో అతని వంక చూస్తుంటుంది. గుడ్లను పొదిగిన ఆ పాము అతడిని కాటేయడానికి ప్రయత్నిస్తుంది. చాలా చాకచక్యంగా అతడు తప్పించుకుంటాడు. రెండోసారి కూడా కాటేయడానికి వచ్చినా దూరం జరుగుతాడు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jay Brewer (@jayprehistoricpets)

కొండచిలువ రెండుసార్లు కరవడానికి వచ్చినా ఆ వ్యక్తి అస్సలు బెదరలేదు. అక్కడే నిలబడి ఉండగా.. మూడోసారి మాత్రం అతడి చొక్కాను పట్టుకుని వదిలేస్తుంది. అయినా కూడా అతడు భయపడకుండా తన పని తాను చేసుకుంటూ వెళతాడు. ఇందుకు సంబందించిన వీడియోను jayprehistoricpets అనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. నీ ధైర్యానికి ఓ పెద్ద సలాం బాసూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: పంత్‌ పట్టించుకోకున్నా.. ఊర్వశి సీరియస్‌గా ప్రేమిస్తుందా! ఆస్ట్రేలియాలో హాట్ బ్యూటీ

Also Read: దేవరకొండతో కలిసి మాల్దీవులకు రష్మిక.. 'అవి' పెట్టుకోవడంతో అడ్డంగా బుక్కయ్యారుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News