Scary Python Video: ఏం గుండె రా నాయనా నీది.. ఏకంగా 20 అడుగుల కొండచిలువతో పరాచకాలు, చెక్కిలిగింతలు .. (వీడియో)!

20 Feet Python Snake Video: ప్రస్తుతం ఓ యువకుడు కొండచిలువకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేయిస్తోంది.. ఈ వీడియోలో కొండచిలువపై చేతివేసి యువకుడు సాహసోపేతంగా కనిపించడం మీరు చూడవచ్చు. ఇంతకీ ఈ వీడియో చివరిలో ఏం జరిగిందో మీరే తెలుసుకోండి..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 17, 2024, 04:45 PM IST
Scary Python Video: ఏం గుండె రా నాయనా నీది.. ఏకంగా 20 అడుగుల కొండచిలువతో పరాచకాలు, చెక్కిలిగింతలు .. (వీడియో)!

 20 Feet Python Snake Video: ప్రస్తుతం చాలామంది పెంపుడు జంతువులను పెంచుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది కుక్కలు, కుందేలు పిల్లలు చిలుకలు, వింత వింత పక్షులను పెంచుకునేందుకు ఇష్టపడుతున్నారు. మరి కొంతమంది అయితే గుర్రాలను, సింహాలను కూడా పెంచుకుంటూ ఉంటారు. కానీ ఓ వ్యక్తి భిన్నంగా ఆలోచించి ఏకంగా 20 అడుగుల కొండచిలువను పెంచుకున్నాడు. అవును ఇది నమ్మేసక్యంగా ఉండదు. కొండచిలువను పెంచుకోవడమేంది.. కాటేసి పాముకి పాలు పోయడమేందని అందరూ అనుకుంటున్నారా..? ఇది అక్షరాల నిజం. ఓ వ్యక్తి ఏకంగా పెద్ద కొండచిలువనే ఇంట్లో పెంచుతున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో.. ఇంత పెద్ద కొండచిలువను ఎందుకు పెంచుకుంటున్నాడో ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

చాలామంది చిన్న చిన్న జంతువులను పెంచుకోవడం చూసి ఉంటారు.. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఏకంగా 20 అడుగుల కొండచిలువను పెంచేశాడు. ఈ వీడియోను చూసిన వారికి హార్ట్ బీట్ అమాంతం రెట్టింపు అవుతుంది. అవును ఈ వీడియో చాలా మందికి భయానకారంగా అనిపించవచ్చు. అలాగే చూసిన ప్రతి ఒక్కరు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కూడా వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొంతమంది " ఆ కొండచిలువ అతని మింగేసేది అందుకు చూస్తోందని.. సరైన సమయం వస్తే తప్పకుండా అమాంతం మింగేస్తుందని" కామెంట్లలో రాసుకు వచ్చారు. అంతేకాకుండా మరికొంతమంది అయితే పాముతో స్నేహం చేసిన వారు.. దాని కాటుకు బలైపోతారని రాసుకు వచ్చారు.. ఏది ఏమైనా ఇంత పెద్ద కొండచిలువను పెంచుకోవడం చాలా గ్రేట్ అని మరికొంతమంది అంటున్నారు. 

Also read: Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్

 
 
 
 
 

 వీడియో వివరాల్లోకి వెళ్తే.. కొండచిలువకు అతడికి ఉన్న స్నేహం అంతో ఇంతో కాదనిపిస్తుంది. ఎందుకంటే ఆ కొండచిలువను అతను ఎన్నోసార్లు కితకితలు పెట్టినప్పటికీ ఏమాత్రం ఆగ్రహానికి లోన అవడం లేదు. అంతేకాకుండా చాలాసార్లు ఆ వ్యక్తి కొండచిలువను తాకినట్లు కూడా మీరు చూడవచ్చు. ఆ యువకుడు దానితో ఎంతో చక్కగా ఆడుకుంటున్నాడు. అంతేకాకుండా దానిపై కూర్చుని నోట్లో చేయి కూడా పెట్టి అటు ఇటు అంటున్నాడు.  ఆ పాము మాత్రం ఏం చేయకుండా యువకుడిని చూసి చూడనట్టు వదిలేస్తుంది. దీన్నిబట్టి చూస్తే వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏమిటో అర్థం అవుతోంది. ఇంకా ఇదే ప్లేస్ లో వేరే పాములు ఉంటే తప్పకుండా ఆ యువకుడిని దాడి చేసి ప్రాణాలు కోల్పోయేలా చేసేవి.. కానీ ఈ పాము మాత్రం నోట్లో చెయ్యి పెట్టినప్పటికీ ఏమాత్రం ఏమనడం లేదంటే చాలా గొప్ప విషయమే..

ఈ వీడియోలో మీరు అతను ఆ కొండచిలువ తలపై చేయి వేసి ఎంతో ప్రేమగా నిమురుతున్న సన్నివేశాలు కూడా కనిపిస్తాయి. నిజానికి పాములు ఇలా నిమురుతున్న సమయంలో దాడి చేసే అవకాశాలు ఉన్నాయి కానీ ఈ పాము మాత్రం చూసి చూడనట్టు వదిలేయడం విశేషం.. ప్రస్తుతం ఈ కొండచిలువకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికీ ఈ వీడియోను కోట్లాదిమంది నెటిజన్స్ వీక్షించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి ప్రమాదకరమైన పాములను పెంచుకునే క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు పాటిస్తూ వాటిపట్ల ప్రేమగా ఉంటే తొందరగానే అలవాటై స్నేహపూర్వకంగా ఉంటాయి.

Also read: Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

  

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News