Viral Video: విమానంలో ధూమపానం పూర్తిగా నిషిద్ధమని అందరికీ తెలుసు. మరి ఆ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు తెలియదా..స్పైస్‌జెట్ విమానంలో హాయిగా సిగరెట్ తాగుతున్న ఆ వీడియో వైరల్ అవుతోంది.
విమానంలో సిగరెట్ తాగడం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా నిషిద్ధమే. కారణం సిగరెట్ స్మోకింగ్ పూర్తిగా ప్రమాదకరం కావడమే. అయినా సరే ఆ నిబంధనల్ని పూర్తిగా తుంగలో తొక్కి..సేఫ్టీ రూల్స్ పాటించకుండా..స్పైస్‌జెట్ విమానంలో ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ కెమేరా కంటికి చిక్కాడు. ఆ వ్యక్తి ఎవరో సామాన్యుడు కూడా కాదు. యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్. పేరు బాబీ కటారియా. గురుగ్రామ్‌కు చెందిన వ్యక్తి. విమానంలో వెనుకన హాయిగా పడుకుని మరీ సిగరెట్ తాగుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు విషయం ఏమంటే ఈ వీడియో పాతది. అయినా ఇప్పుుడెందుకో సోషల్ మీడియాలో బాగా విస్తృతమౌతోంది.
ఈ వ్యక్తి దుబాయ్ నుంచి ఢిల్లీ వస్తున్న క్రమంలో జనవరి 23, 2022న షూట్ చేసిందిగా తెలుస్తోంది. ఈ వీడియో పాతదని..అప్పట్లో ఈ చర్యకు అతనిపై చర్యలు కూడా తీసుకున్నామని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నిర్ధారించింది.
సేఫ్టీ నిబంధనల ప్రకారం దేశంలో డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో సిగరెట్ తాగడం నిషిద్ధం. ఈ వీడియో వైరల్ కావడంతో సెక్యూరిటీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ నిప్పుతో అతని ఆ విమానాన్ని అంటించేలా ఉన్నాడు..వెంటనే అరెస్టు చేయమంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.వెంటనే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ప్రకారం అతడిని అరెస్టు చేయమని మరి కొందరు కామెంట్ చేశారు. చాలామంది కో పాసెంజర్లను చంపేందుకు ప్రయత్నించాడని..స్పైస్‌జెట్ సిబ్బంది ఏం చేస్తున్నారంటూ ఇంకొందరు మండిపడ్డారు.
Also read: Rakhi Festival 2022: ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో ఇతడు ఏం పోస్ట్ చేశాడో తెలుసా ?
New rule for Bobby kataria ? @JM_Scindia @DGCAIndia @CISFHQrs pic.twitter.com/OQn5WturKb
— Nitish Bhardwaj (@Nitish_nicks) August 11, 2022
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook