టెడ్డీబేర్‌తో శ్రద్ధా దివాలీ విషెస్..!

  

Last Updated : Oct 19, 2017, 02:02 PM IST
టెడ్డీబేర్‌తో శ్రద్ధా దివాలీ విషెస్..!

అందరూ దీపావళి రోజున తమ ఆత్మీయులకి ఏదో ఒక విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ కూడా వినూత్నమైన రీతిలో తన ఫేస్బుక్ అభిమానులకు దీపావళి విషెస్ చెప్పారు. ఒక టెడ్డీబేర్ చేస్తున్న ఫన్ కామెంట్రీ వీడియోని విషెస్ రూపంలో పోస్టు చేశారు. దాదాపు 2 వేలకు పైగా లైకులతో, 83 షేర్లతో ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.

ఈ వీడియోతో పాటు దీపావళి సందేశాన్ని కూడా పోస్టు చేశారు శ్రద్ధా. ఈ దీపావళి మీకు ఎంతో నవ్వును, ఆనందాన్ని, శాంతితో పాటు ఆయురారోగ్యాలను అందించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ దీపావళి.. అని పోస్టు చేశారామె. గతంలో శ్రద్ధాకపూర్ యాంటీ క్రాకర్ దీపావళికి మద్దతు ఇస్తూ మాట్లాడినందుకు చాలామంది ఆమె మీద విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే.

అయితే సింపుల్ దీపావళి విషెస్ మాత్రమే చెప్పి.. ఈసారి అలాంటి వివాదానికి ఏమీ కారణం కాలేదు ఈ బాలీవుడ్ బ్యూటీ. ప్రస్తుతం శ్రద్ధా ప్రభాస్ సరసన సాహో చిత్రంలో నటిస్తున్నారు. అలాగే అపూర్వ లఖియా దర్శకత్వంలో ఈమె నటించిన హసీనా పార్కర్ గత నెలే విడుదలైంది. 

 

Trending News