Snake bite treatment: How to prevent snake venom, what to do and what not to do : ప్రపంచంలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో పాముకాటును నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో పాముకాటు గురై చనిపోయే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో పాముకాటును ఎక్కువగా నిర్లక్ష్యం చేసినట్లుగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 2017లో గుర్తించింది.
WHO ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం పాము కాటుకు (Snakebite) గురయ్యే వారి సంఖ్య 5.4 మిలియన్ (54 లక్షలు) వరకు ఉంటోంది. ప్రపంచ వ్యాప్తంగా పాముకాటు కారణంగా ఏటా 81,000 నుంచి 1,38,000 మంది మరణిస్తున్నారట. చాలా పాములు విషపూరితమైనవి కానప్పటికీ.. పాము కరిచిన వెంటనే వైద్యం అందించడం చాలా అవసరం. పాము విషం (snake venom) లాలాజల స్రావం. అయితే పాముల్లో రెండు రకాల విషాలుంటాయి. ఒక రకం పాము విషం.. నరాలను ప్రభావితం చేస్తుంది.. మరో రకం పాము విషం.. రక్తాన్ని ప్రభావితం చేస్తుంది.
పాము కాటుకు గురైన వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే ఎలాంటి పాము కరిచిందో డాక్టర్లకు వివరించగలగాలి. దీంతో డాక్టర్లు త్వరితగతిన మెరగైన చికిత్స అందించడానికి వీలవుతుంది. అయితే పాము కరిచిన ప్రదేశం ఉబ్బే అవకాశం ఉన్నందున వెంటనే శరీరంపై ఉండే బెల్ట్, నగలు, వాచ్, ఉంగరాలు మొదలైనవాటిని తీసివేయాలి. స్ట్రెచర్ మీద పాముకాటుకు గురైన వ్యక్తి తీసుకెళ్లేటప్పుడు
అతను ఎడమ వైపు తిరిగి పడుకునేలా చూడాలి. పాముకాటుకు గురైన వ్యక్తి బాగా ఊపిరి పీల్చుకునేలా వాతావరణం కల్పించాలి.
పాముకాటుకు (Snakebite) గురైన చోట ఎక్కువగా వాపు రావడం.. వికారంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త అవసరం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు నొప్పి, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటే 20WBCT పరీక్ష చేయించాలి. అలాగే డాక్టర్ సలహా మేరకు సపోర్టివ్ డ్రగ్స్‌తో పాటు యాంటీవీనమ్ కూడా పాము కాటు గురైన వ్యక్తికి అందించాలి.
పాముకాటుకు గురైన రోగులను కనీసం 24 గంటల (24 hours) పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలి. అయితే కొందరు తమను ఏ పాము కరిచిందో డాక్టర్లకు చూపించేందుకు కరిచిన పామును బతికి ఉండగానే తీసుకొస్తుంటారు. మరికొందరు దాన్ని చంపి తీసుకొస్తుంటారు. అయితే బతికి ఉన్న పాము అయినా చనిపోయిన పాము అయినా సరే చాలా ప్రమాదకరం. కొన్నిసార్లు చనిపోయిన పాముల కాటు వల్ల కూడా మరణించిన వారు ఉన్నారు. అందువల్ల అలాంటి పనులు చేయకండి.
Also Read : Dual mode vehicle: ప్రపంచంలోనే తొలి రైల్ కం బస్...ఎక్కడో తెలుసా?
పాము కాటుకు గురైన వారు భయపడకుండా ఉండాలి. మూఢ విశ్వాసాలతో చేపట్టే వైద్యం చేయించుకోకండి. కరిచిన పామును చంపడం లేదంటే దాన్ని పట్టుకోవడం వంటివి చేయవద్దు. పాముకాటుకు గురైన ప్రాంతం వద్ద కోయకండి.. అలాగే దాన్ని దగ్గర నోరు పెట్టి విషాన్ని పీల్చే ప్రయత్నం చేయకండి. గట్టిగా బట్టతో లేదంటే తాడుతో దేనితో కూడా కట్టకండి. అలాగే పాము కరిచిన చోట ఐస్‌ను రాయడంలాంటివి చేయకండి. అలాగే మసాజ్ కూడా చేయకండి. దానివల్ల మరింత ప్రమాదం ఏర్పడుతుంది. మూలికలు లాంటివి ఉపయోగించడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు.
పాముకాటుకు గురికాకుండా ఇలా చేయాలి..
బయటకు వెళ్లేటప్పుడు వీలైనంత వరకు పాదాలను మొత్తం మూసి ఉంటే బూట్లను వేసుకోండి.
రాత్రిపూట ఎక్కడైనా బయటకు వెళ్తుంటే టార్చ్ ఉపయోగించండి.
అడుగు ముందుకు వేసే ముందు మీరు కాలు ఎక్కడ పెడుతున్నారో చూస్తూ ఆచితూచి అడుగు ముందుకు వేయండి.
నేలపై పడుకోకండి. దోమతెరలను ఉపయోగించండి.
ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. మీ ఇంటి పరిసరాల్లో ఎలుకలు లేకుండా చూసుకోండి.
Also Read : iPhone 13: షాక్: ఐ ఫోన్ ఆర్డర్ చేస్తే...డైరీ మిల్క్ చాక్లెట్స్ వచ్చాయి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి