Snakes Smuggling in Flight: ఎవరైనా విదేశాలకు వెళ్తే అక్కడి నుంచి వచ్చేటప్పుడు వారికి నచ్చిన బట్టలు కొనుక్కొచ్చుకుంటారు లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుక్కొచ్చుకుంటారు. అదీ కాకపోతే నచ్చిన వస్తువులు కొనుక్కొచ్చుకుంటారు. కానీ ఇదిగో ఇక్కడ ఒక మహిళ మాత్రం విదేశాల నుంచి ఇండియాకు వస్తూ బ్యాగుల నిండా పాములు నింపుకుని వచ్చింది. ఆమె బ్యాగుల్లో, సూట్‌కేసుల్లో డబ్బాల్లో పాములు ఉండటం చూసి షాక్ అవడం కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అధికారుల వంతయ్యింది.
అవును, చెన్నై ఎయిర్ పోర్టులో ఒక మహిళా ప్రయాణికురాలి బ్యాగుల్లో పాములు, ఊసరవెల్లి బయటపడిన దృశ్యం విమానాశ్రయంలో కలకలంరేపింది. కౌలాలంపూర్ నుంచి శనివారం చెన్నైకి వచ్చిన ఒక మహిళ బ్యాగును చెక్ చేసిన కస్టమ్స్ అధికారులకు కళ్లు చెదిరిపోయే సీన్ కనిపించింది. ముందుగానే అందిన సమాచారంతో మహిళపై అనుమానం వచ్చిన అధికారులు.. ఆమె బ్యాగులను తనిఖీ చేసి అందులో కనిపించిన దృశ్యం అదిరిపడ్డారు.
కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఆ మహిళా ప్రయాణికురాలి బ్యాగుల్లో రకరకాల జాతులకు చెందిన 22 రకాల పాములు, ఒక ఊసరవెల్లి కనిపించింది. అది కూడా చిన్నా చితక పాములు కాదు.. ఏకంగా పది అడుగులకుపైనే పొడవున్న పాములు కూడా అందులో ఉన్నాయి. ఆ పాములను బ్యాగుల్లోంచి బయటికి తీసి పరిశీలించడం అధికారులకు తల ప్రాణం తోకకొచ్చినట్టయింది. స్నేక్ క్యాచర్స్ సహాయంతో సిబ్బంది ఆ పాములను పరిశీలించారు.
ఇది కూడా చదవండి : Husband, wife Jokes: అందమైన యువతిని చూస్తున్న భర్త తన భార్యకు ఎలా చిక్కాడో చూడండి
అరుదైన జాతులకు చెందిన ఈ పాములను స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన మహిళా ప్రయాణికురాలిపై కస్టమ్స్ యాక్ట్ 1962, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 చట్టాల కింద కేసు నమోదు చేసుకుని ఆ పాములు, ఊసరవెల్లిని స్వాదీనం చేసుకున్నారు. అనంతరం ఆ మహిళా ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ పాముల వీడియోలు చూసి జనం కూడా షాకవుతున్నారు. అదేదో హాలీవుడ్ సినిమా తరహాలో ఒకవేళ విమానం గాల్లో ఉండగానే ఆ పాములు బ్యాగుల్లోంచి బయటికొస్తే అప్పుడు పరిస్థితి ఏంటని సందేహం వ్యక్తంచేస్తున్నారు.
ఇది కూడా చదవండి : Rapido Driver Viral Video: యువతిని అక్కడ ఇక్కడ తడుముతూ ర్యాపిడో డ్రైవర్ వేధింపులు... స్పీడ్‌గా ఉన్న బైక్‌పై నుంచే దూకిన బాధితురాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK