Drunk Man Kisses Flight Attendant: విమానంలో తప్పతాగి ఫ్లైట్ అటెండెంట్‌కి కిస్ ఇచ్చాడు

Drunk Man Kisses Flight Attendant: మద్యం మత్తులో ఉన్న ఆ మందు బాబు మేల్ ఫ్లైట్ అటెండెంట్ తనకు కిస్ ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతూ అతడికి గొడవకు దిగాడు. అంతటితో ఊరుకోకుండా ఆ మేల్ ఫ్లైట్ అటెండెంట్ మెడ పట్టుకుని బలవంతంగా మీదకు లాగి అతడి మెడపై గట్టిగా ఓ ముద్దు పెట్టాడు. ఊహించని ఈ హఠాత్పరిణామానికి షాక్ అవడం మేల్ ఫ్లైట్ అటెండెంట్ వంతయ్యింది.

Written by - Pavan | Last Updated : May 11, 2023, 07:03 PM IST
Drunk Man Kisses Flight Attendant: విమానంలో తప్పతాగి ఫ్లైట్ అటెండెంట్‌కి కిస్ ఇచ్చాడు

Drunk Man Kisses Flight Attendant: విమానంలో ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నాడు కానీ తన ప్రవర్తనలో మాత్రం వరస్ట్ క్లాస్ చూపించాడు. విమానంలో ఫ్లైట్ అటెండెంట్ ఇచ్చిన మద్యం తాగి ఆ ఫ్లెట్ అటెండెంట్ తోనే తప్పుగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి తనకు మద్యం సర్వ్ చేసిన మేల్ ఫ్లైట్ అటెండెంట్ ని తనకు కిస్ ఇవ్వాల్సిందిగా పట్టుపట్టాడు. మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడి ప్రవర్తన చూసి ఖంగుతిన్న సదరు మేల్ ఫ్లైట్ అటెండెంట్ అతడికి ముద్దు ఇవ్వడానికి నిరాకరించాడు.

software-engineer-died-of-heart-attack-while-dancing-on-wedding-stage.jpg

అయితే, మద్యం మత్తులో ఉన్న ఆ మందు బాబు మేల్ ఫ్లైట్ అటెండెంట్ తనకు కిస్ ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతూ అతడికి గొడవకు దిగాడు. అంతటితో ఊరుకోకుండా ఆ మేల్ ఫ్లైట్ అటెండెంట్ మెడ పట్టుకుని బలవంతంగా మీదకు లాగి అతడి మెడపై గట్టిగా ఓ ముద్దు పెట్టాడు. ఊహించని ఈ హఠాత్పరిణామానికి షాక్ అవడం మేల్ ఫ్లైట్ అటెండెంట్ వంతయ్యింది. అన్నట్టు ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేసి ఇంత రచ్చరచ్చ చేసింది మద్యం మత్తులో ఉన్న ఒక యువకుడు అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే అతడు ఒక 61 ఏళ్ల వృద్ధుడు. అతడి పేరు డేవిడ్ అలన్ బర్క్. అమెరికాలోని మిన్నెసోట నుంచి అలస్కా వెళ్లే డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడి చేతిలో తనకు జరిగిన అవమానాన్ని అతడు తన తోటి విమానం సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. ఇదేంటని నిలదీసినందుకుగాను తప్పతాగి తప్పుగా ప్రవర్తించడమే కాకుండా విమానంలో సిబ్బందితో గొడవకు దిగాడు. ఈ గొడవలో ఫ్లైట్ కేప్టేన్ కి తీసుకెళ్తున్న ఫుడ్ డిష్ కూడా కిందపడి పగిలిపోయింది. విమానంలో వృద్ధ మందు బాబు రచ్చరచ్చ చేయడం చూసిన కేప్టేన్.. ఇదే విషయాన్ని అలస్కా ఎయిరో పోర్టుకు ఫిర్యాదు చేశాడు. 

ఇది కూడా చదవండి : Truck Falling Down: ట్రక్కును ఓవర్ టేక్ చేస్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త

కేప్టేన్ ఫిర్యాదుతో విమానం అలస్కాలో ల్యాండ్ అవడంతోనే ఎయిర్ పోర్ట్ పోలీసులు అతడి కోసం కాచుకూర్చున్నారు. తనని అరెస్ట్ చేసిన పోలీసులకు కూడా డేవిడ్‌ చుక్కలు చూపించాడు. తాను విమానంలో వీరంగం వేయలేదని.. అసలు విమానంలో తాను తాగనే లేదని పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. డెల్టా ఎయిర్ లైన్స్ మేనేజ్మెంట్ ఫిర్యాదు మేరకు డేవిడ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిపై పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. డేవిడ్ ఏప్రిల్ 27న ఈ కేసులో కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : Waitress Beats Customers: మీద చెయ్యేసిన రౌడీ కస్టమర్లని రఫ్ఫాడించింది

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News