Viral Video today: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో కొన్ని నవ్వు తెప్పిస్తే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇంకొన్ని హృదయవిధారకరంగా ఉంటున్నాయి. తాజాగా చిరుతపులికి సంబంధించిన ఓ వీడియో (Leopard Video) నెటిజన్లు కంట కన్నీరు పెట్టిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో తెగ ట్రెండ్ అవుతోంది.
మనిషి తన సౌలభ్యం కోసం అడవులను నరికివేస్తున్నాడు. దీంతో అడవిలో ఉండాల్సిన జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో అవి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. తాజాగా ఓ చిరుతపులి హైవేపై వెళ్తున్న కారు బానెట్ కింద ఇరుక్కుపోయింది. దానిని నుంచి బయటపడటానికి తీవ్ర ఇబ్బందులు పడింది. డ్రైవర్ కారును రివర్స్ చేయడంతో..అది ఊపిరిపీల్చుకున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియోను ఐఎఫ్ ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.
Wild & painful 😣 Heartbreaking. Nothing can be more distressing than seeing our wild getting destroyed due to linear infrastructure…
VC: @WildLense_India pic.twitter.com/jLiGyylzpe— Susanta Nanda IFS (@susantananda3) June 20, 2022
ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా హైవేల అభివృద్ధిని పలువురు యూజర్లు తప్పుబట్టారు. ''ఈ వీడియోలో చిరుతపులికి దయనీయంగా కనిపిస్తోంది. అయితే భవిష్యత్తులో మనుషులు కూడా అదే దయనీయ పరిస్థితిలో ఉంటారని'' ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.. ”మనం వారి ఆవాసాలలోకి ఎంత ఎక్కువ చొరబడతామో, వారు మరింత గందరగోళానికి గురవుతారు మరియు మన నివాసాలలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహం యొక్క జీవవైవిధ్యాన్ని నాశనం చేయడానికి భూమిపై ఉన్న ఏకైక జాతి మనమే'' అంటూ మరొకరు రాశారు.
Many wanted to know as to what happened to the leopard. Here it is. Bruised but managed to escape the impending death. Efforts on to locate & treat the injured one. https://t.co/meXkRYWUH9 pic.twitter.com/v4puxEsYYw
— Susanta Nanda IFS (@susantananda3) June 20, 2022
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook