Longest Giant King Cobra: ప్రస్తుతం నెట్టింట జంతువులకు సంబంధించిన చాలా రకాల వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా ఈ వీడియోలతో పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోటీ పడుతున్నాయి. పాములకు సంబంధించిన వైరల్ వీడియోలను నెటిజన్లు ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇటీవలే కొన్ని పాములకు సంబంధించిన వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో టాప్ 5లో ట్రెండింగ్ గా మారడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవలే టాప్ సెవెన్ పాములకు సంబంధించిన ఓ వైరల్ వీడియో నెట్టింట తెగ చెక్కర్లు కొడుతుంది.
ముందుగా మీరు ఈ వీడియోని గమనిస్తే.. ఓ యూట్యూబ్ ఛానల్ టాప్ సెవెన్ కింగ్ కోబ్రాలకు సంబంధించిన వైరల్ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో టాప్ సెవెన్ వీడియోలో టాప్ 2 కింగ్ కోబ్రాలు 25 ఫీట్ల కంటే ఎక్కువగానే పొడవుగా ఉన్నాయి. మీరు ఈ వీడియోలో మొదటి క్లిప్ ను గమనిస్తే.. ఓ స్నేక్ క్యాచర్ ఇంట్లోకి దూరుతున్న పామును పట్టుకొని బయటకు లాగి.. ఓ సంచిలో బంధించడం చూడొచ్చు. ఇక రెండో వీడియో విషయానికొస్తే.. ఓ భారీ కింగ్ కోబ్రా కిటికీలోంచి బయటికి వెళ్తున్న సన్నివేశాలు మీకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తాయి.
ఇక మూడో క్లిప్ లో ఓ కొండ ప్రాంతంలోని జనావాసాల్లో మధ్య సంచరించిన 25 అడుగుల కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్లు పట్టుకున్న సన్నివేశాలు మీకు కనిపిస్తాయి. ఈ భారీ గల పామును సంచిలోకి బంధించేందుకు చేసిన ప్రయత్నాలు ఆ వీడియోలు మీరు చూడొచ్చు. ఇక నాలుగో క్లిప్ విషయానికొస్తే.. ఒక భారీ కింగ్ కోబ్రా ఇంటి కిటకిలో నుంచి ఇంట్లోకి సంచారం చేస్తుంటే.. దానిని గమనించి, ఆ పామును పట్టుకున్న వీడియో తెగ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలా ఏడు క్లిప్పుల్లో ఒక్కొక్క సన్నివేశం ఒక్కొక్కలా అందర్నీ భయపెట్టే విధంగానే ఉన్నాయి.
Also read: Hair Mask: డేండ్రఫ్ సమస్యను సమూలంగా తొలగించే హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఇదే
ఈ వైరల్ అవుతున్న వీడియోను.. ఎనిమల్స్ ఎన్కౌంటర్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేశారు. నాలుగు నిమిషాలకు పైగా ఉన్నా ఈ వీడియోను కోటి 30 లక్షల మంది వీక్షించారు. అంతేకాకుండా కొంతమంది కామెంట్ల రూపంలో వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కామెంట్ల విషయానికొస్తే.. ఇంతవరకు ఇలాంటి పాములను మేము ఎప్పుడూ చూడలేం అంటూ కొందరు..ఈ సన్నివేశాలు భయాందోళనకు గురిచేసాయని మరికొందరు అంటున్నారు.
Also read: Hair Mask: డేండ్రఫ్ సమస్యను సమూలంగా తొలగించే హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook