OMG Video: షూ లో దూరిన నాగు పాము.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video today: షూ లో ఓ పెద్ద కోబ్రా దూరిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వానకాలంలో మనం ఎంత అప్రమత్తంగా ఉండాలోనే ఈ విషయాన్ని ఈ వీడియో చాటి చెబుతుంది.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 13, 2022, 07:16 PM IST
  • వర్షాకాలంలో జాగ్రత్త
  • షూ లో నాగుపాము హల్ చల్
OMG Video: షూ లో దూరిన నాగు పాము.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video today: వర్షాకాలం వచ్చిందంటే చాలు పాములు ఇంట్లోకి వచ్చేస్తాయి. అందుకే మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఈ పాములు ఎక్కడో ఒక చోట నక్కి ఉంటాయి. మన ఇంట్లో చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు ఎందులోనైనా దాక్కుని ఉండవచ్చు. తాజాగా ఓ వ్యక్తి షూ లో నాగుపాము (Snake Video) దూరిన సంఘటన ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇంత చిన్న  షూ లో అంత పెద్ద పాము ఎలా నక్కి ఉందోనని వారు షాకు కు గురవుతున్నారు. 

వీడియో ఓపెన్  చేస్తే... ఓ ఇంట్లోని వ్యక్తి షూ లో నాగుపాము దూరుతుంది. దానిని గమనించిన అతడు.. పాములు పట్టడంలో శిక్షణ పొందిన వ్యక్తిని పిలుస్తాడు. వారు వచ్చి షూ లోనే కోబ్రాను బయటకు తీశారు. అది బయటకు రాగానే బూసలు  కొడుతూ కాటువేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకే షూ వేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలనే సందేశాన్ని ఇస్తుంది ఈ వీడియో.

ఈ వీడియోను  ఇండియన్ ఫారెస్ట్  సర్వీస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో షేర్ చేశారు. ''వానకాలంలో విచిత్రమైన ప్రదేశాలలో పాములు కనిపిస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. పాములు పట్టడంలో శిక్షణ పొందిన వారి సాయం తీసుకోండి'' అంటూ ఆయన క్యాప్షన్ పెట్టారు. అప్ లోడ్ చేసినప్పటి నుంచి మిలియన్స్ వ్యూస్ సాధించి టాప్ ట్రెండింగ్ వీడియోల్లో ఒకటి నిలిచింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐఎఫ్ఎస్ అధికారికి కృతజ్ఞతలు తెలిపారు. 

Also read: Snakes Romance Video: గడ్డిలో పాముల రొమాన్స్.. చూస్తే షాక్ అవుతారు! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News