Height Increasing Surgery: ఎత్తు పెరగడం కోసం రూ. 1.35 కోట్లు పెట్టి రెండు సర్జరీలు

Height Increasing Surgery: అమెరికాకు చెందిన మోసెస్ గిబ్సన్ ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు. కానీ తనని అందరూ పొట్టివాడిగా చూస్తున్నారనే భావన మోసెస్ గిబ్సన్‌ని చిన్ననాటి నుంచే దహించి వేసింది. స్కూల్ డేస్‌లోనే తనని తోటి స్టూడెంట్స్ కామెంట్స్ చేస్తున్నారనే ఆవేదనతో రగిలిపోతూ పెరిగాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2023, 06:58 PM IST
Height Increasing Surgery: ఎత్తు పెరగడం కోసం రూ. 1.35 కోట్లు పెట్టి రెండు సర్జరీలు

Height Increasing Surgery: ఎత్తుగా ఉండాలనే కోరిక చాలామందికి ఉంటుంది. ఎత్తుగా ఉండే వారినే అమ్మాయిలు ఇష్టపడుతుండటమే అందుకు ఒక కారణం. ఆరడుగుల ఆజానుబాహుడు అని పిలిపించుకోవాలనే కోరిక చాలామందిలోనే ఉంటుంది. సినిమాల్లోనూ హీరోల ఇమేజ్ అలాగే చూపిస్తుండటంతో సమాజంలో చాలామంది అదే ఛట్రంలో ఇరుక్కుపోయారు. ఎత్తుగా ఉండాలని అనుకోవడమే కాదు.. అలా ఉండలేకపోయినందుకు బాధపడుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. మరొకరు బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే వారిని తప్పు పట్టాల్సిందిపోయి.. తమని తామే తక్కువగా చేసుకుని చూసుకుంటూ ఆత్మస్థైర్యం కోల్పోతున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తే ఈ మోసెస్ గిబ్సన్.

అమెరికాలోని మిన్నెసోటకు చెందిన మోసెస్ గిబ్సన్ అనే యువకుడి రియల్ స్టోరీ ఇది. మోసెస్ గిబ్సన్ ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు. కానీ తనని అందరూ పొట్టివాడిగా చూస్తున్నారనే భావన మోసెస్ గిబ్సన్‌ని చిన్ననాటి నుంచే దహించి వేసింది. స్కూల్ డేస్‌లోనే తనని తోటి స్టూడెంట్స్ కామెంట్స్ చేస్తున్నారనే ఆవేదనతో రగిలిపోతూ పెరిగాడు. ఎత్తు పెరగడం కోసం చిన్నప్పటి నుంచే మెడిసిన్స్ వాడాడు. అయినా లాభం లేకపోయింది. అయినప్పటికీ ఎత్తు పెరగాలన్న కోరిక మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. చివరకు భూతవైద్యులను కూడా సంప్రదించాడు. 

 

ఎవరైనా సరే జీవితంలో పైకి ఎదగాలని బలంగా కోరుకుంటారు. కానీ మోసెస్ గిబ్సన్ మాత్రం ఎలాగైనా సరే ఎత్తు పెరిగేందుకే జీవితంలో పైకి రావాలనుకున్నాడు. అందుకోసం చాలా కష్టపడ్డాడు. పగలు సాఫ్ట్ వేర్ జాబ్ చేశాడు.. రాత్రి ఉబర్ డ్రైవర్ గా పనిచేశాడు. ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించున్నాడు. తాను ఎత్తు పెరిగేందుకు ఇక సర్జరీలే దిక్కు అనుకున్నాడు. ఎంతో రిస్క్ తీసుకుని రెండు సర్జరీలు చేయించుకున్నాడు. సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్న మోసెస్ గిబ్సన్ ఈ జూన్ నాటికి 5 అంగుళాల ఎత్తు పెరగాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాడు.

ఇది కూడా చదవండి : Goa Flight Ticket Price: గోవాకు ఫ్లైట్ టికెట్ కేవలం రూ. 85 మాత్రమే

ఈ రెండు సర్జరీల కోసం మోసెస్ గిబ్సన్ 1,70,000 అమెరికన్ డాలర్లు ఖర్చు చేశాడు. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే మోసెస్ గిబ్సన్ ఎత్తు పెరిగేందుకు చేయించుకున్న రెండు సర్జరీల కోసం ఏకంగా కోటి 35 లక్షలు వెచ్చించాడు. మోసెస్ గిబ్సన్ ఇదంతా ఎందుకు చేశాడో తెలుసా ?.. కేవలం తను ఎత్తు లేని కారణంగానే తన డేటింగ్ లైఫ్ కూడా హ్యాపీగా ఉండటం లేదనే ఫీలింగ్ తనను అన్నింటికంటే ఎక్కువగా దహించి వేసిందంటున్నాడు మోసెస్. గతంలో ఇలా ఎత్తు పెరగాలనే కోరికతో కొంతమంది లేనిపోని సర్జరీలు చేయించుకుని, అవి వికటించడంతో ప్రాణాల మీదికి తెచ్చుకున్న సంగతి తెలిసిందే.  

ఇది కూడా చదవండి : Bear Vs Man Video: ఎలుగుబంటి దాడి నుంచి తప్పించుకునేందుకు చెట్టు ఎక్కబోయాడు.. కానీ అంతలోనే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News