Viral Video: వామ్మో.. పిల్లలు ఆడుకునే బౌన్సీ చైర్ కింద టైగర్ స్నేక్.. షాకింగ్ వీడియో వైరల్..

Snake viral video: పిల్లలు ఆడుకునే బౌన్సీ చైర్ కింద టైగర్ స్నేక్ కన్పించింది. దీంతో అక్కడున్న వారంత ఒక్కసారిగా భయంలో దూరంగా పారిపోయినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 29, 2024, 02:54 PM IST
  • ఇంట్లో బైటపడ్డ టైగర్ స్నేక్..
  • నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..
Viral Video: వామ్మో.. పిల్లలు ఆడుకునే బౌన్సీ చైర్ కింద టైగర్ స్నేక్.. షాకింగ్ వీడియో వైరల్..

cobra snake viral video:  సాధారణంగా పాములు చలికాలంలో ఎక్కువగా ఇళ్లలోకి దూరిపోతుంటాయి. అవి ఎలుకల వేటలో మన ఇళ్లకు వస్తుంటాయి. పాముల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంటున్నాయి. పాములు ప్రత్యేకమైన వీడియోలు ఇటీవల నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి . నెటిజన్లు కూడా వీటిని అదేదో వింతగా.. ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ క్రమంలో  మొత్తానికి ఇటీవల పాముల వీడియోలకు మాత్రం తెగ డిమాండ్ పెరిగిందని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం మరొ షాకింగ్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.  ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్నట్లు తెలుస్తొంది. 

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by The Snake Hunter (@snakehunteraus)

సౌత్ మోరాంగ్ లో క్రిస్మస్ వేడుకల్లో ఉండగా.. ఒక కుటుంబం ఈ షాకింగ్ అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు తెలుస్తొంది.  అక్కడ ఇంటిలో బౌన్సీ చైర్ కింద భయంకరమైన టైగర్ స్నేక్ హల్ చల్ చేసింది. దీంతో అక్కడి వారు భయంతో పారిపోయారు. వెంటనే పాములను పట్టుకునే వాళ్లకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఆ పామును చూసి అది భయంకరమైన టైగర్ స్నేక్ అని చెప్పారంట.

దీనివిషయం ప్రపంచంలోనే అత్యధిక విషపూరితమైందని అక్కడివారు చెబుతున్నారు. టైగర్ స్నేక్  కరిస్తే మాత్రం ప్రాణాలతో బైటపడే చాన్స్ లు అస్సలు ఉండదని అక్కడి వాళ్లు చెబుతున్నారు. మొత్తానికి ఈ టైగర్ స్నేక్ ఘటన మాత్రం ప్రస్తుతం  వార్తలలో నిలిచిందని చెప్పుకొవచ్చు.

Read more: Viral Video: వంకాయల్ని బాత్రూమ్‌లోకి తీసుకెళ్లిన యువతి.. ఛీ.. ఛీ.. ఇలా చేసిందేంటీ.. షాకింగ్ వీడియో వైరల్..

వీరిలక్ బాగుందని ఆ పామును గమనించారు లేకపోతే.. ఎంతటి దారుణం జరిగిపోయేదో అని ఆ ఇంటి వాళ్లు మాత్రం షాకింగ్ కు గురౌతున్నారంట. ఈ క్రమంలో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
 

Trending News