ఒబామా కూతురు పొగ త్రాగితే మీకేంటి..?

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియా ఒబామాకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది. నోటి నుండి పొగ వదులుతూ ఎంజాయ్ చేస్తున్న ఆ అమ్మాయి వీడియో పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Last Updated : Nov 25, 2017, 12:24 PM IST
ఒబామా కూతురు పొగ త్రాగితే మీకేంటి..?

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియా ఒబామాకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది. నోటి నుండి పొగ వదులుతూ ఎంజాయ్ చేస్తున్న ఆ అమ్మాయి వీడియో పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఒక మాజీ అధ్యక్షుడి కుమార్తె ఇలా పొగ తాగుతూ, ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందని ఆమెను సోషల్ మీడియాలో ట్రాల్ చేయడం ప్రారంభించారు. పలు ట్వీట్‌లు కూడా చేశారు. ఈ క్రమంలో మలియాకి మద్దతు పలుకుతూ, డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా తన సందేశాన్ని పంపారు. "అది ఆమె ప్రైవసీ.. ఆమె ఇష్టం. ఒక ప్రైవేటు సిటిజన్‌గా ఆమె ఏమి అనుకుంటుందో అది చేసే స్వేచ్ఛ ఆమెకు ఉంది. ఇలాంటి విషయాలను పట్టించుకుంటే ఎలా" అని ఆమె ట్విటర్ వేదికగా తెలిపారు. అలాగే మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియా కూడా ఈ వీడియో పట్ల స్పందించారు. ఆమె ప్రైవేటు లైఫ్ ఆమె ఇష్టం.. కాస్త బెటర్‌గా ఆలోచించండి అని తెలిపారు. 

 

 

మలియాకి చెందిన ఇలాంటి వీడియోయే గతంలో కూడా సోషల్ వీడియోలో బాగా వైరల్ అయ్యింది. కాలేజీ ఫుట్‌బాల్ గేమ్‌లో భాగంగా హార్వర్డులో తన స్నేహితుడిని ముద్దు పెట్టుకున్న మలియా వీడియో కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యి విమర్శలకు గురైంది. అలాంటి సమయంలో మలియా తల్లి మిచెల్ స్పందించారు. మలియా బయటకు వెళితే చాలు.. అనేకమంది వచ్చి ఆమెతో ఫోటో దిగాలని కోరుకుంటారు.  మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి విషయాల్లో  నేను ఒకటే చెబుతాను. అందరికీ ప్రైవేటు లైఫ్ ఉంటుంది. అది గుర్తుంచుకొని అందరూ గౌరవంగా నడుచుకుంటే చాలు అని తెలిపారు. 

 

 

 

Trending News