ప్రపంచ వ్యాప్తంగా జరిగే సంఘటనలు ఈ మధ్య మనకు సులభంగా సామాజిక మాధ్యమాల్లో ( Social Media ) కనిపిస్తున్నాయి. అమెరికాలో జరిగేవి ఇండియాలో కూడా ట్రెండ్ అవుతుంటాయి. అదే విధంగా అమీర్ పేట్ వీడియో అమెరికాలో కూడా వైరల్ అవ్వవచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు అంటారు కదా.. కంటెంట్ లో దమ్ము ఉంటే సోషల్ మీడియా నెటిజెన్స్ ( Netizens ) ఎప్పుడూ ఆదరిస్తారు అనడానికి మనకు కనిపించే ట్రెండీ, ఫన్నీ వీడియోలే ఉదాహరణగా చెప్పవచ్చు.
ఉదాహరణకు ఈ వీడియోనే చూడండి. ఇది ఎవరు తీశారో.. ఎక్కడ తీశారో.. ఎప్పుడు తీశారో తెలియదు. కానీ చాలా మంది దీన్ని చూస్తున్నారు.
When the cat is on a battery saving mode.... pic.twitter.com/2Xw7cJg0us
— Susanta Nanda IFS (@susantananda3) October 3, 2020
ఈ వీడియోలో (Viral Video ) ఒక తాబేలుపై ఒక పిల్లి ఉచిత ప్రయాణం చేస్తుంది. పాపం తాబేలు తిన్నగా నడవడం తప్పా.. మరేం చేయలేదు. పైగా మిగితా జంతువుల్లా అగ్రెసివ్ కూడా కాదు. కోపం వచ్చినా అది చూపించేం అవకాశం లేదు. అందుకే దేవుడి దాని సాఫ్ట్ నేచర్ ను బట్టి అంత స్ట్రాంగ్ డిప్ప ఇచ్చాడేమో సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం. తాబేలు డిప్ప ఎంత బలమైందో.. దాని మంచితనం అంతకన్నా గొప్పదైంది. దీన్నే అలుసుగా తీసుకుని చిన్ని చిన్ని జంతువులు, పక్షులు దాని డిప్పపై కూర్చుని ప్రయాణిస్తుంటాయి.
Peaceful coexistence ! Can someone spot the fish too ?😀! Let’s caption this friendship of species belonging to different kingdoms ! pic.twitter.com/MIhmVj7hLg
— Aman Preet IRS (@IrsAman) October 5, 2020
ఈ పిల్లి కూడా అలాంటిదే. అయితే ఈ పిల్లికి ఇలా ఫ్రీ ట్రిప్ కొట్టే ఐడియా ఎలా వచ్చింది అనేది కూడా ఆలోచించాల్సిన విషయం అంటున్నారు నెటిజెన్స్.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR