Viral Video: విమానాన్ని నెడుతున్న ప్రయాణీకులు..వీడియో చూసి నెటిజన్స్ నవ్వులు..

Viral Video: కొంతమంది వ్యక్తులు విమానాన్ని నెడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2021, 08:04 PM IST
Viral Video: విమానాన్ని నెడుతున్న ప్రయాణీకులు..వీడియో చూసి నెటిజన్స్ నవ్వులు..

Passengers push Airplane: సాధారణంగా ఏ కారునో, బస్సునో చేతులతో నెట్టడం చూసుంటాం. మరి విమానాన్ని తోయ్యడం ఎప్పుడైనా చూశారా..చూడకపోతే ఈ వీడియో చూసి తీరాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా(Social Media)లో తెగ వైరల్ అవుతోంది. ఈ వింత వీడియో చూసి.. నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ సంఘటన బుధవారం నేపాల్(Nepal)లోని ఓ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. 

Also read: Newlyweds fall from JCB, Viral Video : కొత్తగా ట్రై చేసిన నవజంట.. జేసీబీ నుంచి కింద పడి షాక్ ఇచ్చారు!

వివరాల్లోకి వెళితే..
నేపాల్ కోల్టీలోని బజురా ఎయిర్ పోర్టు( Bajura Airport)లో ల్యాండింగ్ చేస్తున్నప్పుడు విమానం వెనుక టైర్ పేలింది. దీంతో విమానం(Airplane) రన్‌వే నుంచి టేకాఫ్ కాలేదు. ఇంతలో.. విమానం అడ్డుగా ఉండటంతో మరో విమానం పైకి ఎగరలేకపోయింది. దీంతో విమానాశ్రయం(AirPort)లోని ప్రయాణికులు, భద్రతా సిబ్బందితో కలిసి విమానాన్ని రన్‌వే నుంచి అడ్డుతప్పించారు. తారా ఎయిర్‌ సంస్థ(Tara Airlines)కు చెందిన ఈ విమానాన్ని ప్రయాణికులు నెడుతున్న వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్(Twitter)లో షేర్ చేశాడు. అంతే ఒక్కసారిగా ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x