Breast Milk Jewellery: తల్లిపాలతో జ్యువెలరీ.. మాతృత్వానికి జ్ఞాపకంగా ఆర్నీమెంట్ తయారీ

Breast Milk Jewellery: బ్రెస్ట్ మిల్క్‌తో తయారుచేసిన స్టోన్స్‌ను ఓ మహిళ తన చేతి ఉంగరానికి ధరించి.. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. బ్రెస్ట్ ఫీడింగ్ దశను ఎప్పటికీ ఒక తీపి గుర్తుగా ఉంచుకునేందుకు ఆమె ఈ స్టోన్స్‌ను తయారుచేయించుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2021, 04:22 PM IST
  • బ్రెస్ట్ ఫీడింగ్ రింగ్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన మహిళ
  • బ్రెస్ట్ ఫీడింగ్‌ ఎప్పటికీ ఒక జ్ఞాపకంగా ఉంచుకునేందుకు
  • మాతృత్వాన్ని ఆస్వాదించే క్రమంలో బ్రెస్ట్ ఫీడింగ్ జ్యువెలరీ
Breast Milk Jewellery: తల్లిపాలతో జ్యువెలరీ.. మాతృత్వానికి జ్ఞాపకంగా ఆర్నీమెంట్ తయారీ

Breast Milk Jewellery: తల్లి పాలు బిడ్డకు అమృతంతో సమానమని చెబుతారు. బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే పోషక గుణాలు తల్లి పాలల్లో లభిస్తాయి. తల్లి పాలకు బదులు పోత పాలు పడితే.. శిశువులు కొన్ని రకాల ప్రాణాంతక వ్యాధుల బారినపడేందుకు అవకాశం ఉంటుందని చెబుతారు. అందుకే శిశువులకు తల్లి పాలు తప్పనిసరి. నిజానికి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది పిల్లలతో తల్లికి ఎమోషనల్ గా బంధాన్ని ఏర్పరుస్తుంది. తల్లి పాల గురించి మాట్లాడుకుంటే ఇవే విషయాలు ఎక్కువగా చర్చకు వస్తాయి. కానీ తల్లి పాలతో జ్యువెలరీని కూడా తయారుచేస్తారనే విషయం మీకు తెలుసా...

అమెరికాకు చెందిన అల్మా పర్తిదా అనే మహిళ తన బ్రెస్ట్ మిల్క్‌తో చేతి ఉంగరానికి అమర్చే స్టోన్స్ తయారు చేయించుకుంది. చేతికి వాటిని ధరించి.. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీనిపై ఆమె ప్రముఖ మీడియా న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. తన బిడ్డ అలెస్సాకు దాదాపు 18 నెలలు బ్రెస్ట్ మిల్క్ ఇచ్చినట్లు తెలిపారు. బ్రెస్ట్ ఫీడింగ్‌ ఎప్పటికీ ఒక ప్రత్యేక గుర్తుగా ఉండిపోతే బాగుంటుందని భావించానన్నారు. ఇందుకోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేయగా... బ్రెస్ట్ మిల్క్‌తో జ్యువెలరీ తయారుచేస్తారనే విషయం తెలిసిందన్నారు. 

 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sarah | Breastmilk Jewelry (@keepsakesbygrace)

 

వెంటనే ఆ కంపెనీ గురించి తెలుసుకుని 10 మి.మీ బ్రెస్ట్ మిల్క్‌ను ఆ కంపెనీకి పంపించినట్లు అల్మా తెలిపారు. నెల రోజుల తర్వాత ఆ కంపెనీ నుంచి మిల్కీ వైట్ హార్ట్స్‌తో కూడిన రింగ్‌ అందిందన్నారు. ఆ రింగ్‌కి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఎమోషనల్ పోస్టు పెట్టారు. మీ ప్రయాణాన్ని గుర్తుచేసుకోవడానికి ఒక ఫార్ములా అవసరమని... ఆ రింగ్ రూపంలో తాను దాన్ని పొందానని, ఆస్వాదిస్తున్నానని ఆ పోస్టులో పేర్కొన్నారు.

Also Read: AP Pension Increase: పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. జనవరి నుంచి రూ.2,500 పంపిణీకి ఉత్తర్వులు జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News