White Paint: ప్రపంచంలోనే అతి తెల్లని పెయింట్, ఏసీలకు ప్రత్యామ్నాయం ఇదేనా

White Paint: వేసవి తాపం లేదా ఉక్కపోత అధికంగా ఉన్నప్పుడు తక్షణం కోరుకునేది చల్లదనం. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులతో ఏసీల వాడకం అధికమైపోయింది. అందుకే ఇప్పుడా ఏసీలకే ప్రత్యామ్నాయం త్వరలో వస్తుంది. ఏసీలకు ప్రత్యామ్నాయమేంటని ఆలోచిస్తున్నారా. నిజమే.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 19, 2021, 05:45 PM IST
White Paint: ప్రపంచంలోనే అతి తెల్లని పెయింట్, ఏసీలకు ప్రత్యామ్నాయం ఇదేనా

White Paint: వేసవి తాపం లేదా ఉక్కపోత అధికంగా ఉన్నప్పుడు తక్షణం కోరుకునేది చల్లదనం. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులతో ఏసీల వాడకం అధికమైపోయింది. అందుకే ఇప్పుడా ఏసీలకే ప్రత్యామ్నాయం త్వరలో వస్తుంది. ఏసీలకు ప్రత్యామ్నాయమేంటని ఆలోచిస్తున్నారా. నిజమే.

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంలో వస్తున్న ప్రతికూల మార్పులు, గ్లోబల్ వార్మింగ్(Global Warming)వంటి కారణాలతో వాతావరణంలో ఎప్పటికప్పుడు మార్పులు సంభవిస్తున్నాయి. వేసవి తాపం లేదా ఉక్కపోత అధికంగా ఉంటుంది. సీజన్‌తో సంబంధం లేకుండా వేడిమి ఓ సమస్యగా మారింది. ఫలితంగా ఎయిర్ కండీషనర్ల సమస్య పెరిగిపోతోంది. ఏసీల కారణంగా విద్యుత్ వినియోగం అధికమైపోతోంది. అందుకే ఇప్పుడు ఏసీలకు ప్రత్యామ్నాయం కోసం జరుగుతున్న పరిశోధన సత్ఫలితాలనిస్తోంది. యూఎస్‌లోని ఇండియానా స్టేట్స్‌కు చెందిన ఫుర్ డ్యూ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతి తెల్లని పెయింట్ తయారు చేశారు. ఇంట్లో గోడలకు వేసుకుంటే ఏసీలు వాడాల్సిన అవసరం లేదంటున్నారు పరిశోధకులు. 

ఫుర్ డ్యూ శాస్త్రవేత్తలు కనిపెట్టిన తెల్లని పెయింట్ తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో(Guinnes Book Of Records) ఎక్కింది. సూర్యకాంతికి రిఫ్లెక్షన్‌ను ఈ పెయింట్ దూరం చేస్తుందట. గ్లోబల్ వార్మింగ్ తగ్గించేదిశగా ఈ వైట్ పెయింట్ పరిశోధన పనిచేయనుంది. అత్యంత తెల్లదనం కారణంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎక్కినట్టు తెలుస్తోంది. ఈ పెయింట్ ను ఓ వేయి స్క్వేర్ ఫీట్ల గోడకు గానీ, రూఫ్‌కు గానీ వేస్తే పది కిలోవాట్ల కరెంట్ అందించే చల్లదనాన్ని అందిస్తుందట. అంటే పది ఇళ్లలోని ఎసీల చల్లదనం కంటే ఎక్కువే. నిజంగా ఈ పెయింట్ అందుబాటులో వస్తే ఏసీల వాడకం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న పెయింట్స్ చల్లదనానికి బదులు వేడిని కల్గిస్తాయి. తెల్ల పెయింట్ 80-90 శాతం సూర్యకాంతిని రిఫ్లెక్స్ చేస్తాయి. ఏ విధమైన చల్లదనాన్ని కల్గించవు. కానీ ఫుర్ డ్యూ సైంటిస్టులు తయారు చేసిన పెయింట్ మాత్రం రివర్స్‌లో అతి చల్లదనాన్ని అందిస్తాయి. కాస్మోటిక్స్‌లో ఉపయోగించే కెమికల్ కాంపౌండ్, అధిక గాఢత కలిగిన బేరియం సల్ఫేట్ కలిపి ఈ పెయింట్ తయారైంది. ధర తక్కువగా ఉండటమే కాకుండా ఎక్కువకాలం పాడవకుండా ఉంటుంది. మార్కెట్‌లో వచ్చేందుకు కాస్త సమయం పట్టినా...ఒకసారి వచ్చాక మాత్రం ఏసీలు కన్పించవేమో ఇక.

Also read: AP Corona Update: ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా సంక్రమణ, తూర్పు గోదావరిలో అత్యధిక కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News