Amalaki Ekadashi 2023: అమలకి ఏకాదశి ఎప్పుడు? ఈరోజున ఉసిరిచెట్టును ఎందుకు పూజిస్తారు?

Amalaki Ekadashi 2023: హిందూ మతం ప్రకారం, ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈ సంవత్సరం అమలకీ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, దాని ప్రాముఖ్యత తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2023, 01:39 PM IST
  • ఏకాదశి విష్ణువు అంకితం చేయబడింది
  • ఫాల్గుణంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశికే అమలకి ఏకాదశి అని పేరు
  • ఇది ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందో తెలుసుకోండి.
Amalaki Ekadashi 2023: అమలకి ఏకాదశి ఎప్పుడు? ఈరోజున ఉసిరిచెట్టును ఎందుకు పూజిస్తారు?

Amalaki Ekadashi 2023: ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని అమలకి ఏకాదశి అంటారు. దీనిని ఉసిరి ఏకాదశి మరియు రంగభారీ ఏకాదశి అని కూడా అంటారు. హిందూ మతం యొక్క విశ్వాసాల ప్రకారం, విష్ణువు స్వయంగా ఉసిరి చెట్టులో నివసిస్తాడు. అందుకే ఆమలకి ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువుతో పాటు ఉసిరి చెట్టును పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఏకాదశి నాడు శ్రీ హరికి ఉసిరికాయను నైవేద్యంగా పెడితే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ సంవత్సరం అమలకి ఏకాదశి ఎప్పుడు, తేదీ, శుభ సమయం మరియు దాని ప్రాముఖ్యతను తెలుసుకుందాం.

అమలకి ఏకాదశి తేదీ
హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తేదీ మార్చి 02 గురువారం ఉదయం 06:39 గంటలకు ప్రారంభమై మార్చి 03 శుక్రవారం ఉదయం 09:01 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం తిథి ఆధారంగా అమలకి ఏకాదశి వ్రతాన్ని మార్చి 03న జరుపుకుంటారు. 
పూజ సమయం 
అమలకి ఏకాదశి వ్రతం పాటించేవారు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. వెంటనే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు శుభకార్యాలు జరుగుతాయి. ఆ తర్వాత శోభన యోగం మెుదలవుతుంది. ఉదయం 06.45 నుండి 11.06 గంటల మధ్యలో శ్రీమహావిష్ణువును పూజించడానికి మంచి సమయం. ఈ వ్రతాన్ని పాటించడం వల్ల మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. 

పారణ  సమయం
అమలకి ఏకాదశి వ్రతం మార్చి 4వ తేదీ ఉదయం 06.44 నుండి 09.03 గంటల మధ్య ఆచరించాలి. ఈ రోజు ద్వాదశి తిథి ఉదయం 11.43 గంటలకు ముగుస్తుంది. 
అదే రోజు మూడు శుభయోగాలు
అమలకి ఏకాదశి రోజున మూడు శుభప్రదమైన యోగాలు రూపొందుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సర్వార్థ సిద్ధి యోగం, తెల్లవారుజామున 03.43 నుంచి సాయంత్రం వరకు సౌభాగ్య యోగం, ఆ తర్వాత శోభనయోగం ఏర్పడుతున్నాయి. 
అమలకీ ఏకాదశి ప్రాముఖ్యత
ఎవరైతే అమలకి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి.. విష్ణువుతో పాటు ఉసిరి చెట్టును పూజిస్తారో వారు మరణానంతరం స్వర్గాన్ని మరియు మోక్షాన్ని పొందుతారు.

Also Read: Holi 2023: హోలీ తర్వాత మేషంలో రాహు-శుక్రుడి కలయిక.. ప్రతి రంగంలోనూ ఈరాశులకు విజయమే ఇక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News