Rasi Phalalu: 2024లో నవపంచమి యోగం ఏర్పాటు..3 రాశులవారికి లక్కెలక్కు..

 Rasi Phalalu: 2024 సంవత్సరంలో కేతువు, గురు గ్రహాల కలయిక కారణంగా ప్రత్యేక యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా తుల రాశితో పాటు మరికొన్ని రాశులవారు లాభాలు పొందబోతున్నాయి. దీంతో పాటు ఇతర లాభాలు కూడా కలుగుతాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2023, 08:53 AM IST
 Rasi Phalalu: 2024లో నవపంచమి యోగం ఏర్పాటు..3 రాశులవారికి లక్కెలక్కు..

2024  Rasi Phalalu: రాబోయే కొత్త సంవత్సరం 2024 జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రముఖ్యత కలిగిన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి.  గ్రహలతో పాటు నక్షత్రలు కూడా రాశి సంచారం చేయబోతున్నాయి. ఈ మార్పుల కారణంగా ప్రత్యేక  ప్రభావం కొన్ని రాశుల వారి  జీవితంపై కనిపిస్తుంది. 2024లో అతి కీడు గ్రహంగా పరిగణించే కేతువు కన్యారాశిలో సంచారం చేయబోతుంది. ఇదే రాశిలోకి సంవత్సరం చివరిలో గురు గ్రహం కూడా సంచారం చేయబోతోంది. దీని కారణంగా నవపంచమి యోగం ఏర్పబోతోంది. అయితే ఈ ప్రత్యేక యోగం కారణంగా రాబోయే కొత్త సంత్సవరంలో కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతుంది. ఆ రాశుల వారి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తులారాశి:
2024 సంవత్సరంలో ఏర్పడబోయే నవపంచమి యోగం (Formation Navpancham) కారణంగా తులరాశి వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. ఈ సమయంలో వీరు ఎలాంటి పని చేసిన అదృష్టం వరించి విజయం సాధిస్తారు. దీంతోపాటు స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఎప్పటినుంచో  ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఈ ప్రత్యేక యోగం వల్ల కొత్త ఆదాయం వనరులు పొందుతారు. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. కష్టపడి పని చేసేవారికి భవిష్యత్‌లో మంచి ఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి: 
నవపంచమి యోగం ప్రభావం ఈ సింహ రాశివారిపై కూడా పడబోతోంది. దీని కారణంగా ఈ రాశివారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇంతక ముందు పెండింగ్‌లో ఉన్న పనులన్నీ సులభంగా నెరవేరుతాయి. ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. ఈ యోగం కారణంగా ధనలాభాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే బ్యాంకింగ్‌, మార్కెటింగ్‌ రంగాల్లో పనిచేసేవారు శుభవార్తలు విని ఛాన్స్‌లు ఉన్నట్లు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

కన్యా రాశి: 
ఈ రాశివారికి నవపంచమి యోగం (Formation Navpancham) కారణంగా అనుకున్న పనులను త్వరలో పూర్తి చేస్తారు. దీని ప్రభావంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారు కార్యాలయంలో మంచి ప్రశంసలు పొందుతారు. కానీ ఈ సమయంలో కొన్ని ఆనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇక వైవాహిక జీవితం గడుపుతున్నవారికి ఈ పంచమి యోగం కారణంగా ఎంతో మధురంగా ఉంటుంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News