Astrology: 12 ఏళ్ల తర్వాత కుంభరాశిలో సూర్యుడు, గురుగ్రహాల కలయిక... ఆ 3 రాశుల వారికి డబ్బే డబ్బు..

Astrology: సూర్యుడు, బృహస్పతి సంయోగం చాలా ముఖ్యమైనది. 12 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో సూర్యుడు, బృహస్పతి కలిసి ఉండడం వల్ల ఈ 3 రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2022, 09:05 AM IST
  • 12 ఏళ్ల తర్వాత కుంభ రాశిలో సూర్యుడు, గురు గ్రహం కలయిక
  • 3 రాశులపై తీవ్ర ప్రభావం
Astrology: 12 ఏళ్ల తర్వాత కుంభరాశిలో సూర్యుడు, గురుగ్రహాల కలయిక... ఆ 3 రాశుల వారికి డబ్బే డబ్బు..

Sun and Jupiter conjunction in Aquarius 2022: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి మార్పును చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ప్రతి రాశిచక్రం మార్పు ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ నెలలో 12 ఏళ్ల తర్వాత కుంభరాశిలో సూర్యుడు, గురుగ్రహాల సంయోగం (Sun and Jupiter conjunction in Aquarius) జరగబోతుంది. దీని ప్రభావంతో 3 రాశులవారికి మేలు జరగనుంది. 

మేషం (Aries) :  సూర్యుడు, బృహస్పతిల కలయిక మేషరాశి వారికి చాలా లాభదాయకం. ఈ సంయోగం ఆదాయ గృహమైన మేష రాశిలో పదకొండవ స్థానంలో ఏర్పడుతోంది. అందువల్ల, ఈ రాశి వారికి భారీ ధనలాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు, లావాదేవీలకు ఇది మంచి సమయం.

వృషభం (Taurus) :  సూర్యుడు, బృహస్పతి సంయోగం వృషభ రాశి యొక్క పదో ఇంటిలో అంటే కర్మ మరియు వృత్తిలో ఉంది. అందువల్ల, ఈ కలయిక కొత్త ఉద్యోగాన్ని అందించగలదు. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో మీ పని ప్రశంసించబడుతుంది. సీనియర్లతో సంబంధాలు బాగుంటాయి. అదే సమయంలో, పెద్ద వ్యాపారవేత్తలను కలిసే అవకాశం ఉంది. 

మకరం (Capricorn) : సూర్యుడు, బృహస్పతి కలయిక మకర రాశి వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందగలరు. ఉద్యోగార్థులు ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందవచ్చు. ఆకస్మిక ధన లాభం కలుగుతోంది. 

Also Read: Palm Reading: చేతిలో ఈ గుర్తులు ఉంటే.. అపార సంపదకు యజమానులు అవుతారట..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News