Venus Transit 2023: ఏప్రిల్ 6న వృషభంలోకి శుక్రుడు.. ఏర్పడిన 'మాలవ్య రాజయోగం'.. ఈ 3 రాశులకు ప్రారంభమైన రాజయోగం

Malavya Rajayogam 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల పరివర్తనం, గోచారం 12 రాశులపై ప్రభావం చూపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా, ఇంకొన్ని సందర్భాల్లో అనుకూలంగా ఉంటుంది. అందుకే హిందూ పంచాంగంలో గ్రహాల కదలికల్ని జ్యోతిష్య పండితులు పరిశీలిస్తుంటారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 15, 2023, 02:22 PM IST
Venus Transit 2023: ఏప్రిల్ 6న వృషభంలోకి శుక్రుడు.. ఏర్పడిన 'మాలవ్య రాజయోగం'.. ఈ 3 రాశులకు ప్రారంభమైన రాజయోగం

Shukra Gochar in Taurus: ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో ఏదో ఒక రాశిలో ప్రవేశిస్తుంటుంది. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం 12 రాశులపై ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం బౌతిక సుఖాలకు కారకుడైన శుక్రుడు వృషభ రాశిలో ప్రవేశించడం వల్ల  ఈ రాశులకు రాజయోగం పట్టనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

హిందూ పంచాంగం ప్రకారం శుక్రుడు తన సొంతరాశి వృషభంలోకి ఏప్రిల్ 6న ప్రవేశించాడు. ఈ సందర్భంగా మాలవ్య రాజయోగం ఏర్పడింది. ఈ యోగం కారణంగా 3 రాశులపు అత్యంత లాభదాయకంగా ఉండనుంది. ధనం వైభవం, భౌతిక సుఖాలకు కారకుడైన శుక్రుడు వృషభరాశిలో ప్రవేశించడం వల్ల ఏర్పడిన మాలవ్య రాజయోగాన్ని శుభంగా భావిస్తారు. ఏప్రిల్ 6న శుక్రుడు వృషభ రాశిలో ప్రవేశించాడు. ఈ సందర్భంగా కొన్ని రాశులకు అంతులేని లాభాలు కలగనున్నాయి. మాలవ్య రాజయోగ 3 రాశులకు పూర్తిగా ఫలప్రదం కానుంది. ఈ కాలంలో 3 రాశులపై  ఐశ్వర్యం కురవనుంది. మీ కోర్కెలన్నీ పూర్తవుతాయి. మాలవ్య రాజయోగంతో అదృష్టం వికసిస్తుంది. 

సింహ రాశి:

జ్యోతిష్యం ప్రకారం ఈ రాశి పదవ పాదంలో శుక్రుడి గోచారమైంది. ఫలితంగా మాలవ్య రాజయోగం ఏర్పడింది. ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని లాభాలు కలుగుతాయి. ఆర్ధిక ఇబ్బందులుండవు. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఆలోచిస్తుంటే ఈ సమయం అత్యంత అనుకూలం. కొత్త ఆస్థి లేదా వాహనాలు కొనుగోలు చేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు బదిలీ కోసం ప్రయత్నిస్తుంటే ఇదే మంచి సమయం. కోరుకున్న చోటికి బదిలీ కావచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. 

Also Read: Rajyog 2023: మూడు శతాబ్ధాల తర్వాత ఏర్పడిన నవపంచం రాజయోగం.. ఈ 4 రాశులవారికి లక్, ఐశ్వర్యం..

వృషభ రాశి:

శుక్రగ్రహం ఈ రాశిలో ప్రవేశించి ఉండటంతో ఏర్పడిన మాలవ్య రాజయోగం ప్రభావం ఈ రాశి జాతకులకు అద్భుతంగా ఉంటుంది. ప్రతి పనిలో భారీ విజయం లభిస్తుంది. ఈ జాతకం వాళ్లు ఎక్కడికి వెళ్లినా, ఏ పని చేసినా  విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధికంగా పటిష్ట స్థితిలో ఉంటారు. అన్ని రకాల సుఖ సంతోషాలు లభిస్తాయి. పెళ్లికానివారికి పెళ్లి సంబంధాలు సెట్ కావచ్చు. పదోన్నతి లేదా ఇంక్రిమెంట్లు ఉంటాయి.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి ఏడవ పాదంలో శుక్రుడు గోచారం చేయడంతో ఏర్పడిన మాలవ్య రాజయోగం కారణంగా ఈ రాశివారికి చాలా అనువైన సమయం. అత్యంత లాభదాయకంగా ఉంటుంది. శుక్రగ్రహాన్ని సుఖం, సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. అందుకు తగట్టే శుక్రుడు ఈ రాశివారికి అంతులేని సుఖ సంతోషాలను అందిస్తాడు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగవచ్చు.

Also Read: Mercury Combust 2023: బుధుడి అస్తమయం, ఏప్రిల్ 23 నుంచి ఆ 4 రాశులకు తీవ్ర సమస్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News