Angarak Yog In Aries: ఏదైనా గ్రహం మరొక గ్రహంతో కలయికను యుతిగా పిలుస్తారని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. అయితే ఈ కలయికల వల్ల కొన్ని రాశుల వారికి మంచి లాభాలు చేకూరుతే, మరి కొన్ని రాశుల వారికి భారీ లాభాలు వాటిల్లే అవకాశాలున్నాయని శాస్త్రం పేర్కొంది. జూలై నెలలోని మూడవ వారంలో అంగారక గ్రహం మేషరాశిలో సంచారం చేసింది. అయితే దీని వల్ల అతంగారక యోగం ఏర్పడిందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రభావంతో పలు రాశుల వారికి రాహు, కేతు సమస్యు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చాలా రకాల అశుభ యోగాలు ఏర్పడతాయని శాస్త్రం సూచిస్తోంది. అయితే ఈ గ్రహం వల్ల మేషరాశి వారిపై ప్రభావవం ఎక్కువని శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ చెడు ప్రభావం ఎంత కాలం ఉంటుంది:
భారత పంచాగం ప్రకారం.. జూలై 27న మేషరాశి వారికి అంగారక యోగం ఏర్పడింది. ఈ యోగం ఆగస్టు 10 వరకు కొనసాగనుంది. అయితే మరో 7 రోజుల తర్వాత.. మేష రాశి వారికి ఈ అశుభ యోగం నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్రం పేర్కొంది. అయితే ఈ ఆగస్టు 10న కుజుడు మేషరాశిని వదిలి వృషభరాశిలోకి ప్రవేశించనున్నారు.
మేషరాశిలో రాహు సంచారం:
కుజుడు ఆగష్టు 10న మేషరాశి నుంచి వృషభరాశిలోకి సంచరించనున్నారు. అయితే అక్టోబర్ 30 వరకు రాహువు మేషరాశిలో ఉంటాడు. రాహువు సంచారం వల్ల వివిధ రకాల చెడు పరిణామాలు ఏర్పడుతాయి. ఇది మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి జీవితంలో ఆకస్మిక సంఘటనలు వచ్చే అవకాశాలున్నాయి. కావున వీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.
అంగారకుని ప్రభావం:
జ్యోతిషశాస్త్రంలో అంగారకుని ప్రభావం వల్ల అశుభ పరిణామాలు ఏర్పడుతాయి. అంతేకాకుండా చిన్న చిన్న విషయాలకే వివాదాలు మొదలవుతాయి. అంతేకాకుండా దాంపత్య జీవితంపై కూడా వివిధ రకాల చెడు ప్రభావం పడే అవకాశాలున్నాయి.
వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి:
>>ఎవరికీ హాని కలిగించకూడదు.
>>కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి.
>> ఈ సమయంలో ఉత్సాహంగా ఉండడం చాలా మేలు.
>> మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.
>>హనుమంతుని పూజించండి.
>>ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి.
>>గోవు సేవ చేయడం వల్ల మంచి లాభాలుంటాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: MP Gorantla Madhav: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Also Read: ప్రభాస్, కీర్తి సురేష్, దేవిశ్రీల ‘హర్ ఘర్ తిరంగా’ సాంగ్.. చూశారా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook