Jwalamukhi Yoga effect: భారతీయ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఏదైనా పని లేదా వ్యాపారం మెుదలపెట్టడానికి ముందు ఆరోజు మంచిదా కాదా, గ్రహాల స్థానం ఎలా ఉంది, యోగాలు ఏవైనా సంభవించబోతున్నాయా ఇలాంటివన్నీ చూస్తాం. ఆస్ట్రాలజీ ప్రకారం, శుభ యోగంలో చేసే పనులు శుభ ఫలితాలను, అశుభ యోగంలో చేసే కార్యాలు చెడు ఫలితాలను ఇస్తాయి. గ్రహాలు మరియు రాశుల స్థానాల మార్పు దీని వెనుక ఉన్న కారణం. ఈరోజు అలాంటి అశుభకరమైన యోగం గురించి చెప్పుకుందాం. అదే జ్వాలాముఖి యోగం. ఈ యోగ సమయంలో ఎలాంటి కార్యం తలపెట్టినా అది అశుభ ఫలితాలనే ఇస్తుంది.
జ్వాలాముఖి యోగం ఎప్పుడు?
జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం, జూన్ 5, 2023న జ్వాలాముఖి యోగం ఏర్పడబోతుంది. ఇది ఆ రోజు తెల్లవారుజామున 3.23 నుండి ప్రారంభమైన.. ఉదయం 6.38 వరకు ఉంటుంది.
జ్వాలాముఖి యోగం ఎలా ఏర్పడుతుంది?
ఆస్ట్రాలజీ దృష్ట్యా, జ్వాలాముఖి యోగం తిథి, యోగం మరియు నక్షత్రాల కలయికతో ఏర్పడుతుంది. ఈ అశుభ యోగం ఐదు తేదీలు మరియు ఐదు రాశుల కలయికతో ఏర్పడుతుంది.
మొదటిది - మూల నక్షత్రం ప్రతిపద తిథి రోజున ఉండాలి.
రెండవది - పంచమి తిథి నాడు భరణి నక్షత్రం ఉండాలి.
మూడవది - అష్టమి తిథి నాడు కృత్తిక నక్షత్రం
నాల్గవది - నవమి తిథి నాడు రోహిణి నక్షత్రం
ఐదవది - దశమి తిథి నాడు ఆశ్లేష నక్షత్రం
Also Read: Guru Gochar 2023: మరి కొన్ని గంటల్లో ఈ 4 రాశుల జాతకం మారిపోనుంది.. ఇందులో మీ రాశి ఉందా?
జ్వాలాముఖి యోగ ప్రభావాలు
1. ఈ అశుభ యోగంలో ఎవరైనా వివాహం చేసుకుంటే.. వారి పెళ్లి ఏదో ఒక సమస్య వస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉండదు.
2. జ్వాలాముఖి యోగ సమయంలో ఎటువంటి శుభకార్యాలు ప్రారంభించకూడదు, ఎందుకంటే అది మంచి ఫలితాలను ఇవ్వదు.
3. జ్వాలాముఖి యోగంలో పుట్టిన బిడ్డ అరిష్ట యోగం కలిగి ఉండవచ్చు. దీని కోసం జాతకాన్ని చూడటం సరైనది.
4. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జ్వాలాముఖి యోగంలో వేసిన విత్తనం కూడా మంచి పంటను ఇవ్వదు.
5. జ్వాలాముఖి యోగంలో ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైతే.. అతను చాలా కాలం పాటు ఆ వ్యాధితో బాధపడాల్సి ఉంటుంది.
6. ఈ అశుభ యోగంలో బావి తవ్వడం, కొత్త ఇంటికి పునాది వేయడం వంటి పనులు చేయకూడదు.
Also Read: Surya Grahan 2023: మరో నాలుగు రోజుల్లో ఈ రాశులకు మహార్ధశ.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.