Job Remedies On Monday: జీవింతంలో కొన్ని సార్లు ఎంత కష్టపడిన కూడా అస్సలు కలిసిరాదు. ముఖ్యంగా ఏరంగంలో నైన గ్రోత్ అనేది ఉండాలి. మనం ఎంతో కష్టపడి ఉద్యోగాలు చేస్తుంటాం. కానీ మన బాస్ మనం పడుతున్న కష్టాన్ని గుర్తించకపోతే ఆ పెయిన్ మాములుగా ఉండదు. కొందరు ఈ ఒత్తిడిని భరించలేక నానా ఇబ్బందులు పడుతుంటారు. అయిన పట్టువదలకుండా మరింతగా అందులో రాణించడానికి ప్రయత్నిస్తుంటారు. మరికొందరు మాత్రం మనకు టైమ్ బాగాలేదని, సర్దుకుపోతారు.
Read More: Glowing Skin Tips: గ్లోయింగ్ స్కిన్‌కు ఖరీదైన క్రీమ్స్ అవసరంలేదు.. ఈ ట్రిక్ పాటించండి చాలు..
అయితే.. మనం జీవితంలో ఎంత కష్టపడిన కూడా కాస్తంతా లక్ కూడా కలిసి రావాలి. అప్పుడే మనం జీవితంలో ఒక మంచి స్థానానికి ఎదుగుతాము. కొందరు ఉద్యోగంలో గ్రోత్ లేని వారు.. తరచుగా జ్యోతిష్యులను, పండితులను కలుస్తు ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో సోమవారం రోజు సూర్యోదం లేచి స్నానం చేసి ఈ పరిహరాలు చేస్తే వారంలోనే జీవితం మారిపోతుందని జ్యోతిష్యులు చెబుతుంటారు.
సోమవారం భోళా శంకరుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఆయనకు కేవలం ఒక కలశం నిండా నీరు పోసి, బిల్వపత్రాలు సమర్పిస్తే తెగ సంతోష పడిపోతారు. హర.. హర.. మహదేవా.. అంటే భక్తుల బాధలను ఇట్టే దూరం చేస్తారు. సోమవారం శివుడిని పాలు, పెరుగు, తేనె , నెయ్యితో, అభిషేకం చేయాలి. అదేవిధంగా శివుడి ఆలయంలో వెళ్లి రావి చెట్టు నీడలో దీపం వెలిగించాలి. అక్కడ చెట్టు కింద ఉన్న నల్ల చీమలకు కాస్తంతా చక్కెర వేయాలి.
అంతే కాకుండా.. అవకాశం ఉన్న వారు ఆ రోజు పేదలకు తమ వంతుగా ఏదైన దానం కానీ, వస్త్రాలు కానీ ఇవ్వాలి. శివుడికి భస్మం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయనకు భస్మం సమర్పించాలి. బిల్వ దళాలలో ఏక, ద్వి,త్రి దళం,పత్రాలు ఉంటాయి. అదే విధంగా శివుడికి మాత్రం తులసీ దళం అస్సలు సమర్పించకూడదు.
Read More: Shani Dev: శనివారం ఈ 5 వస్తువులను ఇంట్లోకి అస్సలు తెచ్చుకోవద్దు.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?
శివుడిని అర్దనారీశ్వరుడి స్వరూపం అంటారు. అందుకే ఆయనను కొలుచుకుంటూ ఉద్యోగంలో ప్రమోషన్ లతో లభిస్తుంది. అదే విధంగా పెళ్లికానీ యువతీ యువకులు, ఆయనను ఇలా భక్తితో పూజిస్తే మంచి యోగ్యమైన కన్యతో పెళ్లికూడా వెంటనే కుదురుతుంది. శివుడిని పూజిస్తే, వినాయకుడు ఆనందపడతాడు. మనకు ఎలాంటి విఘ్నాలు రాకుండా కాపాడతాడు. ఆయన దగ్గర ఉండే నందీశ్వరుడు, వీరభద్రుడు కూడా ఉంటారు. వీరినికూడా కొలిస్తే మనకు శత్రువుల బాధలను లేకుండా చేస్తారని జ్యోతిష్యులు శివారాధన గొప్పతనం వివరిస్తుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Media ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook