Astrology: ఈ రాశుల వారి పై శని దేవుడి అపార కరుణ.. ఈ 4 రాశుల వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం గ్యారంటీ..

Astrology: నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన న్యాయం, ధర్మానికి ప్రతీక. ప్రస్తుతం శనీశ్వరుడు తన సొంత రాశి అయిన కుంభంలో వక్ర గమనంలో సంచరిస్తున్నాడు. నవంబర్ 13న వరకు శనీశ్వరుడి వక్ర గమనంలో సంచరించడం వలన ఈ రాశుల వారికీ అనుకోని లాభాలు కలగనున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 5, 2024, 07:20 AM IST
Astrology: ఈ రాశుల వారి పై శని దేవుడి అపార కరుణ.. ఈ 4 రాశుల వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం గ్యారంటీ..

Astrology: వేద జ్యోతిషశాస్త్రంలో శనీశ్వరుడికి ప్రత్యేక  స్థానం ఉంది. ఈయన గమనం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. శని దేవుడు జూన్ 2 నుంచి కుంభంలో వక్ర గమనంలో సంచరిస్తున్నాడు.  శనీశ్వరుడి వక్ర గమనం వల్ల కొన్ని రాశుల వారికీ అనుకూల ఫలితాలు కలగనున్నాయి.  ప్రస్తుతం శని దేవుడు తన మూలత్రికోణ రాశిచక్రం కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు.పంచాంగం  ప్రకారం.. ఈ సంవత్సరం దీపావళి పండుగ నవంబర్ 1, 2024, శుక్రవారం అంటే దీపావళి తర్వాత శనిదేవుడు వక్రం నుంచి తిరిగి మాములు స్థితిలోకి రాబోతున్నాడు. రాబోయే 5 నెలల్లో ఏయే రాశుల వారికి శనిగ్రహం శుభప్రదంగా ఉండబోతుందో చూద్దాం..

Add Zee News as a Preferred Source

మేష రాశి..
మేషరాశి వారికి శని తిరోగమనం శుభప్రదంగా భావిస్తారు. శని దేవుడు ఈ రాశి యొక్క ఆదాయం మరియు లాభ  స్థానంలో తిరోగమనంలో ఉన్నాడు.  ఈ కారణంగా ఈ రాశుల వారకిీ ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. అంతేకాదు మీ కష్టానికి తగ్గట్టుగా డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. గత పెట్టుబడుల నుంచి రాబడిని పొందే బలమైన అవకాశాలున్నాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

వృషభ రాశి..
శనీశ్వరుడి తిరోగమనం వలన ఈ రాశుల వారి జీవితాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. ఈ కాలంలో, మీ పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. వృత్తి జీవితంలో పై అధికారుల ఆశీస్సులు ఉంటాయి. సామాజిక గౌరవం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఈ కాలం వ్యాపారులకు అన్ని లాభాలుంటాయి. ఈ కాలంలో  ఊహించని  లాభాలు అందుకుంటారు.

కన్య రాశి..

శని దేవుడి తిరోగమన ప్రభావం వల్ల ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది.  ఆదాయ  వనరులు పెరుగుతాయి. సీనియర్లతో మీ సంబంధాలు స్నేహ పూర్వకంగా ఉంటాయి. కార్యాలయంలో అనుకున్న  బాగా పని చేస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారులకు ఈ కాలం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా పురోభివృద్ధి చెందుతారు.

వృశ్చిక రాశి..
తిరోగమన శనిశ్వరుడి ప్రభావం వల్ల ఈ రాశుల వారికీ వరం కంటే తక్కువ కాదు.  అంతేకాదు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికంగా కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగవచ్చు. వ్యాపారులు మంచి లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని అందుకుంటారు.

కుంభ రాశి..

తిరోగమన శనిశ్వరుడి ప్రభావం వల్ల కుంభ రాశి వారికీ అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. అంతేకాదు సాహసోపేతమైన పనులు చేయడానికి ఇదే అనువైన సమయం. ఉద్యోగంలో కొత్త పుంతలు తొక్కుతారు. ఈ సమయంలో డబ్బు ప్రవాహం పెరుకే అవకాశాలున్నాయి. డబ్బుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Mediaకి ఎలాంటి సంబందం లేదు.

Also read: Prostate Cancer Signs: బాడీలోని ఈ 3 భాగాల్లో సమస్య ఉంటే ప్రోస్టేట్ కేన్సర్ కావచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News