November Grah Gochar 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం సంచరించినప్పుడల్లా, దాని ప్రభావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. బుధగ్రహం రీసెంట్ గా వృశ్చికరాశిలో (Mercury transit in Scorpio 2022) సంచరించింది. గ్రహాల యువరాజు బుధుడు డిసెంబరు 3న ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా కొన్ని రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
వృశ్చికం (Scorpio): బుధ సంచారం వల్ల డిసెంబరు 3 వరకు వృశ్చికరాశివారు విశేష ప్రయోజనాలను పొందనున్నారు. దీంతో మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో విజయం సాధిస్తారు. బిజినెస్ లో భారీగా లాభాలు ఉంటాయి. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
తుల (Libra): వృశ్చికరాశిలో బుధుడు సంచరించడం వల్ల తులారాశి వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశికి తొమ్మిదవ మరియు పన్నెండవ గృహాలకు బుధుడు అధిపతి. ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కెరీర్లో విజయం సాధించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.
సింహం (Leo): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాశికి చెందిన వారికి బుధ గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంట్లో ఆనందం నెలకొంటుంది. బుధ సంచారం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
వృషభం (Taurus): వృశ్చికరాశిలో బుధుడు సంచారం వల్ల ఈ రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. భాగస్వామ్యంతో చేసే వ్యాపారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు జీవితంలో ముందుకు సాగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు వివాహ ప్రతిపాదనను పొందే అవకాశం ఉంది.
Also Read: Mars Transit 2022: వృషభ రాశిలో మంగళ దేవుడి సంచారం.. 4 నెలలపాటు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook