Budh Gochar 2022: కన్యారాశిలో బుధ సంచారం.. ఏ రాశివారికి లాభం, ఏ రాశివారికి నష్టం?

Budh Gochar 2022: బుధగ్రహం ఇప్పటికే కన్యారాశిలోకి ప్రవేశించింది. బుధ సంచారం ఏ రాశులవారికి అనుకూలమో, ఏ రాశులవారికి ప్రతికూలమో చూద్దాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 24, 2022, 05:19 PM IST
Budh Gochar 2022: కన్యారాశిలో బుధ సంచారం.. ఏ రాశివారికి లాభం, ఏ రాశివారికి నష్టం?

Budh Gochar 2022: గ్రహాల యువరాజు బుధుడు రెండు రోజుల కిందట తన రాశిని మార్చాడు. ఆగస్టు 21వ తేదీ తెల్లవారుజామున 02:14 గంటలకు సింహరాశి నుంచి కన్యారాశిలోకి (Mercury Transit in virgo 2022) ప్రవేశించింది. అక్టోబరు 25 వరకు ఆ రాశిలోనే ఉండనున్నాడు బుధుడు. తర్వాత తుల రాశిలోకి ప్రవేశిస్తాడు. కన్య రాశిలో మెర్య్కూరీ సంచారం మెుత్తం 12 రాశులపై పెను ప్రభావం చూపుతుంది. ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపనుందో తెలుసుకుందాం.

మేషం (Aries): బుధ సంచారం వల్ల ఈ రాశివారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. మీ సీక్రెట్స్ బయట చెప్పడం మానుకోండి. 
వృషభం (Taurus): బుధుడు రాశి మారడం ఈ రాశివారికి కలిసి వస్తుంది. అదృష్టంతో ఈ రాశివారు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ప్రేమ జీవితం బాగుంటుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. మెుత్తానికి ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంటుంది.  
మిథునం (Gemini): కన్య రాశిలో మెర్య్కూరీ సంచారం ఈ రాశివారికి శుభఫలితాలను ఇస్తుంది. కొత్త ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు.  
కర్కాటకం (Cancer): బుధ గ్రహం యొక్క సానుకూల ప్రభావం ఈ రాశివారిపై ఉంటుంది. వీరు ఫ్లాన్ ప్రకారం ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. విదేశాల్లో స్థిరపడాలనే కోరిక నెరవేరుతుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహం (Leo): బుధుని అనుగ్రహం వల్ల ఈ రాశివారు ఆర్థికంగా మెరుగుపడతారు. కీర్తి, సంపదలు పెరుగుతాయి. ఇరుక్కుపోయిన డబ్బు తిరిగివస్తుంది. ఆస్తి సంబంధిత విషయాలు కలిసి వస్తాయి.

కన్య (Virgo): బుధగ్రహ సంచారం వల్ల ఈ రాశివారు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.  ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. విద్యార్థులు రాణిస్తారు. 
తుల (Libra) : బుధ గ్రహం రాశి మార్పు మీకు కలసి వస్తుంది. దుబారా ఖర్చులకు చెక్ పెట్టండి, లేకుంటే ఆర్థికంగా ఇబ్బంది పడవచ్చు. పుడ్ కంట్రోల్ లేకపోతే ఉదర సంబంధింత సమస్యలను ఎదుర్కోంటారు. 
వృశ్చికం (Scropio) : బుధగ్రహం వల్ల ఈ రాశివారికి వ్యాపారంలో లాభాలు మెండుగా ఉంటాయి. మీ ప్రేమ వ్యక్తం చేయడానికి ఇదే మంచి సమయం. కుటుంబ సపోర్టు మీకు లభిస్తుంది. 
ధనుస్సు (Sagittarius): ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశాల్లో జాబ్ ఆఫర్ పొందవచ్చు. మీ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. 
మకరం (Capricron): మెర్క్యురీ యొక్క రాశి మార్పు మీకు విజయాన్నిస్తుంది. మీరు కొత్త వ్యాపారం లేదా ఏదైనా పనిని ప్రారంభించాలనుకుంటే.. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
కుంభం (Aquarius): మీ రాశి వారికి బుధ సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఆఫీసులో మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి. 
మీనం (Pisces): ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. ప్రభుత్వం నుంచి ఈ రాశివారు లబ్ధి పొందే అవకాశం ఉంది.  మెుత్తం మీద మెర్క్యురీ యొక్క సంచారము ఈరాశివారికి శుభప్రదంగా ఉంటుంది.

Also Read: Venus Transit 2022: సింహరాశిలో శుక్రుడు సంచారం.. 23 రోజులపాటు ఈ రాశులకు కష్టకాలం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News