Surya and Budh yuti 2023: వృషభరాశిలో సూర్యుడు, బుధుడు కలయిక వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వల్ల అన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే మే 15న సూర్యుడు వృషభరాశిలో సంచారం చేయగా.. బుధుడు జూన్ 7న వృషభరాశిలో సంచరించబోతోంది. ఇదే తేదినా అన్నివృషభరాశిలో సూర్యుడు, బుధుడు కలవబోతున్నాయి. దీని కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీంతో చాలా రాశులవారు మంచి ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై ప్రభావం:
వృషభ రాశి:
వృషభ రాశికి బుధాదిత్య రాజయోగం వల్ల చాలా అదృష్టాన్ని పొందుతారు. అయితే ఈ యోగం వృషభ రాశివారికి మొదటి స్థానంలో ఏర్పడబోతోంది. కాబట్టి ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ క్రమంలో వివాహా శుభ వార్తలు వింటారు. ముఖ్యంగా ఈ రాశివారు కుటుంబంలో ఆనందాన్ని పొందుతారు. అయితే ఈ రాశివారు ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
సింహ రాశి:
సింహ రాశి వారికి బుధాదిత్య రాజయోగం ఏర్పడటం వల్ల వృత్తి, వ్యాపారాలలో మంచి లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి సులభంగా లభిస్తాయి. ఉద్యోగాలు చేస్తున్నవారు సహోద్యోగుల నుంచి శుభ వార్తాలు వింటారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా మంచి ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. భవిష్యత్‌లో వచ్చే సమస్యలు కూడా ఈ క్రమంలో తీరుతాయి. కాబట్టి ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.
కర్కాటక రాశి:
బుధాదిత్య రాజయోగం కర్కాటక రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే బుధాదిత్య రాజయోగం ప్రభావం ఈ రాశివారిపై తీవ్రంగా పడుతుంది. దీంతో కొత్త ఆదాయ వనరులు వస్తాయి. ఈ క్రమంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారికి భారీ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ రాశివారు కుటుంబ సభ్యుతో ఆనందంగా గడుపడమే కాకుండా విహార యాత్రలకు కూడా వెళ్లొచ్చు. ఈ క్రమంలో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా భారీ లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి