November Vrat-Festival list 2022: నవంబర్ నెల మెుదలవ్వడానికి ఇంకో రోజు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం కార్తీక మాసం కొనసాగుతోంది. నవంబరులో దేవుత్తని ఏకాదశి నాడు శ్రీ హరి నిద్ర నుండి మేల్కొంటాడు. ఈరోజుతో చాతుర్మాసం ముగుస్తుంది. ఈనెలలోనే కార్తీక పౌర్ణమి (Karthika Pournami 2022), సుబ్రహ్మణ్య ఏకాదశి, ప్రదోష వ్రతం, వైకుంఠ చతుర్దశి, మాస శివరాత్రి మెుదలైన పండుగలు వస్తున్నాయి. గ్రహాల రాశి ప్రకారం, ఈ మాసం చాలా ముఖ్యమైనది. నవంబరు నెలలో వచ్చే పండుగలు, వ్రతాలు జాబితాను తెలుసుకుందాం.
నవంబరులో వచ్చే పండుగల లిస్ట్:
01 నవంబర్ 2022 (మంగళవారం) - గోపాష్టమి
04 నవంబర్ 2022 (శుక్రవారం) - చాతుర్మాస్య వ్రత సమాప్తి (దేవుత్తని ఏకాదశి), కార్తీక శుద్ధ ఏకాదశి, భీష్మ పంచకం ప్రారంభం
05 నవంబర్ 2022 (శనివారం) - తులసి వివాహం, శని ప్రదోషం
06 నవంబర్ 2022 (ఆదివారం) - వైకుంఠ చతుర్దశి, విశ్వేశ్వర వ్రతం
07 నవంబర్ 2022 (సోమవారం) - దేవ్ దీపావళి
08 నవంబర్ 2022 (మంగళవారం) - కార్తీక పూర్ణిమ, గురునానక్ జయంతి
11 నవంబర్ 2022 (శుక్రవారం) - సౌభాగ్య సుందరి వ్రతం
12 నవంబర్ 2022 (శనివారం) - సంకష్టి చతుర్థి
16 నవంబర్ 2022 (బుధవారం) - కాల భైరవాష్టమి, వృశ్చిక సంక్రాంతి
20 నవంబర్ 2022 (ఆదివారం) - ఉత్తాన ఏకాదశి
21 నవంబర్ 2022 (సోమవారం) - సోమ ప్రదోష వ్రతం
22 నవంబర్ 2022 (మంగళవారం) - మాస శివరాత్రి
28 నవంబర్ 2022 (సోమవారం) - సుబ్రహ్మణ్య షష్ఠి, వివాహ పంచమి
29 నవంబర్ 2022 (మంగళవారం) - స్కంద షష్ఠి
30 నవంబర్ 2022 (బుధవారం) - నంద సప్తమి
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Budh Gochar 2022: నవంబర్ 13 వరకు తులరాశిలోనే బుధుడు.. ఈ 3 రాశులవారికి తిరుగుండదు చూడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook