Chandra Grahan 2022: గ్రహణం సమయాల్లో కూడా ఇక్కడి దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తారు.. ఎందుకో తెలుసా..?

Chandra Grahan 2022: చంద్ర గ్రహణం కారణంగా అన్ని దేవాలయాల ప్రధాన ద్వారాలు మూసివేస్తారు. అయితే ఈ కింద పేర్కొన్న దేవాల్లో మాత్రం పూజా కార్యక్రమాలు చేస్తారు. ఇంతకీ ఈ దేవాలయాల ప్రముఖ్యత ఏమిటో తెలుసా..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2022, 12:19 PM IST
Chandra Grahan 2022: గ్రహణం సమయాల్లో కూడా ఇక్కడి దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తారు.. ఎందుకో తెలుసా..?

Chandra Grahan 2022 Opening Temples: చంద్ర, సూర్యగ్రహణాలు అనేవి ఒక భౌగోళిక దృగ్విషయం. కానీ జ్యోతిషశాస్త్రంలో ఈ రెండింటికీ చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకార.. ఈ రోజు 2022 సంవత్సరంలో రెండవ, చివరి చంద్రగ్రహణం భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2:39 నుంచి ఈ రోజు గ్రహణం ప్రారంభమవుతుంది. గ్రహణ ప్రభావం రేపు సాయంత్రం 6:19 వరకు ఉంటుంది. ఈ సారి చంద్ర గ్రహణానికి కొంత సమయానికి ముందే సూతక్ కాలం ప్రారంభమైంది. అయితే ఈ క్రమంలో మత పరమైన పూజా కార్యక్రమాలు చేయకూడదు. అంతేకాకుండా ఈ క్రమంలో దేవాలయాల తలుపులు కూడా మూసివేస్తారు. అయితే గుడి తలుపులు మూసివేయడానికి ప్రధాన కారణాలు, ఇతర అంశాలు మనం తెలుసుకోబోతున్నాం..

గ్రహణం సమయంలో ఎందుకు గుడి తలుపులు మూస్తారు..?:
చంద్రగ్రహణానికి సంబంధించిన అనేక నియమాలు గ్రంథాలలో పేర్కొన్నారు. గ్రహణ సమయంలో పూజించడం, దేవుని విగ్రహాలను తాకడం, నిద్రించడం పోవడం మంచిది కాదని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఆలయ తలుపులు కూడా మూసివేస్తారు. చాలా మంది ఈ తలుపులను ఎందుకు మూసివేస్తారో తెలియిక వివిధ రకాలుగా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ అంశాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఏదైనా గ్రహణం సమయంలో భూత శక్తుల ప్రభావం పెరుగుతుందని అంతేకాకుండా దైవిక శక్తుల ప్రభావం తగ్గుతుందని ఈ క్రమంలో పలు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.

ఈ దేవాలయాల తలుపుతు తెరిచే ఉంటాయా..?:
విష్ముపాద దేవాలయం:
బీహార్‌లోని గయలోని విష్ణుపాద ఆలయంపై గ్రహణం ప్రభావం లేదు. అయితే ఈ క్రమంలో దేవాలయాల తలుపులు తెరుకునే ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ పూజలు కూడా నిర్వహిస్తారు.

మహంకాళీ  దేవాలయం:
ఉజ్జయినిలో ఉన్న మహంకాళీ ఆలయం కూడా గ్రహణం సమయంలో తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో గ్రహణ కాలంలో భక్తులు ఆలయాన్ని సందర్శించరు కాబట్టి.. పూజారీలే పూజా కార్యక్రమలు నిర్వహిస్తారని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. హారతికి మధ్య కాస్త తేడా ఉండడమేకాకుండా పూజలో మార్పులు కూడా వస్తాయి.

లక్ష్మీనాథ్ ఆలయం:
సుతక్ కాలంలో కూడా పురాతన లక్ష్మీనాథ్ ఆలయ తలుపు తెరిచి ఉంటాయి. అయితే దేవాలయానికి సంబంధించిన అంశాలను పురాణాల్లో పేర్కొన్నారు. ఈ దేవాలయానికి చాలా ప్రముఖ్యత ఉంది. అయితే ఈ క్రమంలో పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి.

Also Read : KomatiReddy Rajagopal Reddy: తమ్ముడు ఓటమికి అన్న కారణామా?.. రాజ్ గోపాల్ రెడ్డి కొంపముంచిన కాంగ్రెస్

Also Read : Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సస్పెండ్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News