Chandra Grahan 2022: చంద్ర గ్రహణం కారణంగా రాజకీయ నాయకులు, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి.. లేక పోతే అంతే సంగతి..!

Chandra Grahan 2022 Time: చంద్ర గ్రహణం కారణంగా మహిళలు, గర్భిణీలు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. గ్రహణం కారణంగా చాలా రకాల అశుభాలు కలిగే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2022, 01:34 PM IST
  • చంద్ర గ్రహణం కారణంగా రాజకీయ నాయకులు.
  • గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి..
  • పలు రకాల జాగ్రత్తలు పాటించాలి.
Chandra Grahan 2022: చంద్ర గ్రహణం కారణంగా రాజకీయ నాయకులు, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి.. లేక పోతే అంతే సంగతి..!

Chandra Grahan 2022 Time: సూర్యుడి  నీడ భూమి, చంద్రుడు గుండా వెళ్ళే క్రమంలో సమలేఖనం జరిగినప్పుడు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుందని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో చంద్రుడు సంపూర్ణంగా కనిపించడం అగిపోతుంది. అయితే ఇదే ప్రక్రియ నవంబర్‌ 8 వ తేదిన జరగబోతోంది. దీనినే సంపూర్ణ చంద్ర గ్రహణం అంటారు. ఈ చంద్ర గ్రహణం 2022 మాత్రమే కాకుండా 2025లో కూడా ఏర్పడబోతోందని ఖగోళ శాస్త్ర నిపుణులు పేర్కోన్నారు. అయితే ఈ గ్రహణం భారతదేశంలో పలు రాష్ట్రాల్లో పక్షికంగా ఏర్పడినప్పటికీ  కోల్‌కతా, భువనేశ్వర్, పాట్నా, గౌహతి, కొహిమా, ఐజ్వాల్ ఇతర రాష్ట్రాల్లో సంపూర్ణంగా ఏర్పడబోతోందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

చంద్ర గ్రహణం 2022 తేదీ, సమయాలు:
నవంబర్ 8 (మంగళవారం)

సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమవుతుంది.
ముగిసే సమయాలు: సాయంత్రం 6.19  

 జ్యోతిష్య అంచనాలు:
ఈ పరిణామాలు తప్పవు:

- సముద్రంలో అలజడి రేగే అవకాశాలున్నాయి.
- కరువు సమస్యలు, అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.
- ప్రముఖ రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి.
- పంటలు దెబ్బతింటాయి.
- దొంగతనం, దోపిడీ, కిడ్నాప్‌లు జరిగే అవకాశాలున్నాయి.
- బంగారం ధరలు పెరుగుతాయి.
- నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి.
- చిత్రకారులు, రచయితలకు తీవ్ర నష్టాలు.

గ్రహణం క్రమంలో చేయవలసినవి, చేయకూడని పనులు:
- సూతకాలం మొదలైనప్పటి నుంచి స్నానాలు చేయకూడదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
- దానధర్మాలు చేయడం, జపం చేయడం, మంత్ర-సిద్ధి, ధ్యానం మొదలైన పనులు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు.
- సూతక్ కాలంలో విగ్రహాలను తాకకూడదు, అనవసరంగా తినకూడదు లేదా త్రాగకూడదు. ముఖ్యంగా శృంగారంలో పాల్గొన కూడదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
- అబద్ధాలు లేదా మోసపూరిత చర్యలకు దూరంగా ఉండాలి.
- సూతక్ కాలంలో పిల్లలు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, గర్భిణీ స్త్రీలు తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

Also Read: Ind Vs Zim: జింబాబ్వేతో భారత్‌ పోరు నేడే.. తేలనున్న సెమీస్‌ బెర్తులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News