Chandra Grahan 2023: ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం మే 5వ తేదిన వైశాఖ మాసం పౌర్ణమి తిథి ఏర్పడబోతోంది. ఇదే రోజు బుద్ధ పూర్ణిమ కూడా జరుగబోతోంది. ఈ గ్రహణం శుక్రవారం ఉదయం 08:46 గంటలకు ప్రారంభమై 01:02 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఈ ప్రభావం పలు రాశులవారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. గతంలో జరిగిన సూర్యగ్రహణ ప్రభావం భారత్‌పై పడకపోయిన చంద్రగ్రహణం ప్రభావం పడే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
చంద్ర గ్రహణం ప్రత్యేకత:
చంద్రగ్రహణం కేవలం పౌర్ణమి రోజున మాత్రమే ఏర్పుడుతుంది. పూర్వీకులు పౌర్ణమి రోజున చంద్రుడిని రాహు-కేతువులు గ్రహాలు మింగుతాయని చెబుకునేవారు. రాహు-కేతువులు గ్రహాలు కీడుగా పరిగణిస్తారు..కాబట్టి దీని ప్రభావం పలు రాశులవారిపై పడితే తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. గ్రహణానికి 9 గంటల ముందు సూతకం ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో పలు రకాల పనులు చేయడం చాలా హానికరమని నిపుణులు చెబుతున్నారు. అందుకే చంద్రగ్రహణం సమయంలో కొన్ని పనులు చేయడం నిషేధం. అయితే చంద్రగ్రహణ సమయంలో తప్పకుండా పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఆ నియమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం
ఈ మంత్రాలను తప్పకుండా పఠించాలి:
- "ఓం శ్రీ హ్రీ క్లీం శ్రీ సిద్ధ లక్ష్మ్యై నమః" అనే వైభవ లక్ష్మి మంత్రాన్ని తప్పకుండా చంద్రగ్రహణ సమయంలో 108 సార్లు జపించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే లక్ష్మిదేవి అనుగ్రహం లభిస్తుంది.
- "ఓం హ్రీ బగలాముఖీ" చంద్రగ్రహణం సమయంలో ఈ మత్రాన్ని పారాయణం చేయడం వల్ల శత్రువుల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
- చంద్రగ్రహణం సమయంలో తప్పకుండా కులదైవాన్ని కొలుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో గాయత్రీ మంత్రం, మహామృత్యుంజయ మంత్రం జపించాలి.
- చంద్రగ్రహణం సమయంలో "ఓం శ్రీ శ్రీ చంద్రాంశే నమః" అనే మంత్రాన్ని పారాయణం చేయడం వల్ల చంద్ర దోష ప్రభావం తగ్గుతుంది.
- చంద్రగ్రహణం సమయంలో శివ చాలీసా పఠించాలి. ఈ చాలీసా సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook