Chandra Grahan 2023: ఈ ప్రత్యేక చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే..

Chandra Grahan 2023 Pregnancy Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య, చంద్ర గ్రహాలకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో సూతకాలానికి ముందే గర్భిణీ స్త్రీలు పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే పుట్టబోయే బిడ్డ పై తీవ్ర దుష్ప్రభావాలు పడే అవకాశాలు ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2023, 09:35 AM IST
Chandra Grahan 2023: ఈ ప్రత్యేక చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే..

 

Chandra Grahan 2023 In India Date And Time For Pregnancy: ఈరోజు 2023 సంవత్సరంలోని చివరి చంద్రగ్రహణం సంభవించబోతోంది. ఈ చంద్రగ్రహణానికి సంబంధించిన సూతక్ కాలం సాయంత్రం 4 గంటల నుంచే ప్రారంభం కాబోతోంది. ఈ గ్రహణం అక్టోబర్ 29 తెల్లవారుజామున 1:05 నిమిషాలకు ప్రారంభమై..2 గంటలకు ముగుస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గ్రహణం వ్యవధి మొత్తం ఒక గంట పాటు ఉండనుంది. ఈ ఏర్పడబోయే చంద్రగ్రహణ ప్రభావం భారతదేశంపై పడబోతోంది. కాబట్టి ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ఈ గ్రహణ దుష్ప్రభావం పుట్టబోయే బిడ్డ పై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి.

ఈ చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు అస్సలు బయటికి వెళ్లకూడదు. అంతేకాకుండా ఈ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు. ఆహారాలు తినాలనుకునేవారు సూతకాలం సమయంలో తినొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో ఏర్పడే చంద్రకాంతి ఇంట్లో పడకుండా చూసుకోవాలి. 

గర్భిణీ స్త్రీలు ఉండే ఇల్లు గ్రహణం ముగిసిన తర్వాత తప్పకుండా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. వీలైతే ఈ సమయంలో ఇంట్లో ఉన్న ప్రతి అంగుళాన్ని గంగాజలంతో శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో కూరగాయలు కోయడం, షార్ప్ గా ఉన్న వస్తువులను వినియోగించడం మంచిది కాదని పూర్వీకులు చెబుతున్నారు. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు కులదైవాన్ని తలుచుకుంటూ ధ్యానం చేయడం శ్రేయస్కరమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

గ్రహణ సమయంలో అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి, పిల్లలకి, వృద్ధులకి శాస్త్రంలో ఎలాంటి నియమాలు పేర్కొనలేదు. కాబట్టి ఈ సమయంలో వారు ఎలాంటి పనులు చేసిన మంచిదేనని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే సూతకాలానికి ముందే ఆహారాలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే శాస్త్రం ప్రకారం సూతకాలాన్ని కలుషిత కాలంగా పరిగణిస్తారు.

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News