Shiva Chalisa Benefits: శివ చాలీసా పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Shiva Chalisa Benefits: శివుడిని అనుగ్రహం పొందడానికి దోసెడు నీరు అయినా చాలు. అంతటి దయ గలవాడు పరమేశ్వరుడు. రోజూ శివచాలీసా పారాయణం చేస్తే..మీపై శివుడు వరాల జల్లు కురిపిస్తాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 18, 2022, 01:20 PM IST
Shiva Chalisa Benefits: శివ చాలీసా పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Shiva Chalisa Benefits: దేవతలందరిలో పరమశివుడు అత్యంత దయమూర్తి. శివ నామాన్ని  జపిస్తే చాలు కోరిన వరాలు ఇస్తాడు. నీరు అర్ఘ్యం సమర్పించినా చాలు శివుడు (Lord Shiva) కరుణించి..కష్టాల నుండి విముక్తి చేస్తాడు. మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శివ చాలీసా పారాయణం చేయండి. సంపూర్ణ భక్తిభావంతో పూజిస్తే.. భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోజూ శివచాలీసా పఠించడం చాలా ప్రయోజనాలను ఇస్తుంది. ఇది శ్రావణ మాసం (Sravana Masam) నుండి ప్రారంభిస్తే మంచిది. శివచాలీసా నియమాలు, ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

శివ చాలీసా యొక్క ప్రయోజనాలు
శాస్త్రాల ప్రకారం, శివ చాలీసాలో (Shiva Chalisa) శివుడు స్తుతించబడ్డాడు. శివ చాలీసాను ఏ రోజు అయినా పఠించవచ్చు. అయితే పరమశివుడికి ఎంతో ఇష్టమైనా సోమవారం నాడు శివచాలీసా జపిస్తే విశేష ఫలం లభిస్తుంది. శివ చాలీసా జపించడం వల్ల కలిగే అనేక ప్రయోజనాలను గ్రంథాలలో చెప్పబడ్డాయి. గర్భిణీ స్త్రీలు శివ చాలీసా పఠిస్తే శుభ ఫలితాలు పొందుతారు. ఇది గర్భిణీ స్త్రీల పిల్లలకు రక్షణ కల్పిస్తుంది. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు.  శివ చాలీసా కూడా పారాయణం చేస్తే ఒత్తిడి దూరమవుతుంది.  ఏదైనా వ్యసనం ఉన్నట్లయితే దాని నుండి బయటపడతారు. 

Also Read: Sravana Somavaram 2022: ఇవాళే శ్రావణ మాసం మెుదటి సోమవారం.. ముహూర్తం, పూజా విధానం ఇదే.. 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News