Ayodhya Flight: తెలుగు ప్రజలకు శుభవార్త.. అయోధ్యకు ఎంచక్కా ఎగిరిపోవచ్చు

Direct Flight Hyderabad To Ayodhya: ప్రస్తుతం టెంపుల్‌ టూరిజం భారీగా పెరుగుతోంది. కొత్తగా ప్రారంభమైన అయోధ్యకు పెద్ద ఎత్తున భక్తులు వెళ్తున్నారు. అయోధ్య భక్తుల కోసం ఓ శుభవార్త. ఇకపై ఎగురుకుంటూ అక్కడికి వెళ్లిరావొచ్చు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 31, 2024, 07:06 PM IST
Ayodhya Flight: తెలుగు ప్రజలకు శుభవార్త..  అయోధ్యకు ఎంచక్కా ఎగిరిపోవచ్చు

Ayodhya Flight: రెండు నెలల కిందట ప్రారంభమైన అయోధ్య బాల రామమందిరానికి భక్తులు పోటెత్తుతున్నారు. దేశంలోని నలుమూలలా నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుండడంతో అయోధ్య కిటకిటలాడుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తులకు నేరుగా రవాణా సౌకర్యం చాలా తక్కువగా ఉంది. సుదూరం కావడంతో బస్సుల్లో వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఉన్న రైళ్లు కూడా పరిమితితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని గంటల్లో.. అయోధ్యకు సులువుగా చేరుకునేందుకు విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం హైదరాబాద్‌ నుంచి నేరుగా అయోధ్యకు విమానాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు.

Also Read: Tirumala: భక్తులకు అలర్ట్‌.. ఎన్నికల వేళ ఈ విషయం తెలుసుకుని తిరుమల వెళ్లండి

అయోధ్య దర్శనార్థం వెళ్లే భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్- అయోధ్య మధ్యలో నేరుగా విమానాన్ని ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫిబ్రవరి 26వ తేదీన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి లేఖ రాశారు. ఆ లేఖకు స్పందించిన జ్యోతిరాదిత్య హైదరాబాద్‌-అయోధ్య మధ్య విమాన సేవలపై వాణిజ్య విమాన సంస్థలతో మాట్లాడారు. వారితో సంప్రదింపులు చేసి వాణిజ్య విమాన సంస్థలతో మాట్లాడి విమాన సేవలు నడిపేందుకు చర్యలు తీసుకున్నారు.

Also Read: Tirumala: వేసవికి కుటుంబంతో తిరుమల వెళ్తున్నారా..? వచ్చే నాలుగు నెలలు ఇవే ప్రత్యేక సేవలు

ఈ రెండు నగరాల మధ్య విమానాల రాకపోకల కోసం కొన్ని విమాన సంస్థలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్- అయోధ్య మధ్యలో నేరుగా విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీ నుంచి  వారానికి మూడు రోజుల చొప్పున మంగళ, గురు, శనివారం ఈ విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా అయోధ్యలోని ఎయిర్‌పోర్టుకు విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. అయితే ఏ సంస్థ విమానాలు, టికెట్‌ ధర ఎంత, సమయం వంటి విషయాలు ఇంకా తెలియరాలేదు. 'రెండు నగరాల మధ్య నేరుగా విమాన సేవలు ప్రారంభం కానుండడం ఎంతో సంతోషం' అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News