Rasi Phalalu: ఈ రాశులవారికి దీపావళి పండగ రోజున లక్ష్మిదేవి సిరులు కురిపించబోతోంది..

Diwali 2023 Rasi Phalalu: దీపావళి పండగ ఈ సంవత్సరం కొన్ని రాశులవారికి ఊహించని లాభాలను కలిగించబోతోంది. ఈ సమయంలో గ్రహాల స్థానాల్లో మార్పులు రావడం వల్ల ఏర్పడే యోగాలు కొన్ని రాశులవారికి జీవితంలో పొందలేని ఆస్తిని అందిచబోతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2023, 12:30 PM IST
Rasi Phalalu: ఈ రాశులవారికి దీపావళి పండగ రోజున లక్ష్మిదేవి సిరులు కురిపించబోతోంది..

Diwali 2023 Rasi Phalalu: ఈ సంవత్సరం దీపావళి పండగ నవంబర్ 12న వచ్చింది. హిందు సాంప్రదాయంలో ఈ పండగికి ప్రత్యేక ప్రముఖ్యత ఉంది. అయితే ఈ సంవత్సరం రాబోయే దీపావళి పండ ప్రముఖ్యత మరింత పెరిగిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. పండగ రోజే శుక్ర, బుధ, చంద్ర గ్రహాల స్థితిలో మార్పులు రాబోతున్నాయి. కాబట్టి దీపావళి పండుగ చాలా ఫలవంతమైనదని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ పండగ రోజున గజకేసరితో సహా అనేక రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి  ధనలాభం, ఆస్తి, పలుకుబడి ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఈ దీపావళి పండగ సందర్భంగా అన్ని రాశులవారు లక్ష్మి ఆరాధన చేయడం వల్ల జీవితంలో కష్టాలన్నీ దూరమవుతాయి. 

దీపావళి పండగ ఈ రాశులవారికి చాలా శుభప్రదం:
మేషరాశి:

మేషరాశి వారికి దీపావళి చాలా శుభప్రదమైనదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. గజకేసరి యోగం వల్ల ఊహించని ధనలాభాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది. 

కన్యా రాశి: 
కన్యా రాశి వారికి దీపావళి పండగ సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు ఈ ఏడాది పొడవునా ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి. కుటుంబ సమస్యలు కూడా దూరమవుతాయి.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

వృశ్చిక రాశి: 
ప్రత్యేక యోగాలు ఏర్పడడం వల్ల వృశ్చిక రాశి వారికి ఎక్కడి నుంచో ఊహించని లాభాలు కలుగుతాయి. ఇక వ్యాపారాలు చేసేవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారాల్లో డబ్బులు పెట్టుబడిగా పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ లభిస్తాయి. 

మకర రాశి:
మకర రాశివారికి ఈ సమయంలో ఇంతకు ముందు సంపాదించిన దాని కంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. ఆకస్మాత్తుగా ఊహించని డబ్బులు పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో ఆస్తులను కొనుగోలు చేయడం వల్ల భారీ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో అహంకారం చూపించడం మానుకోవాల్సి ఉంటుంది.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News