Marriage Problems: పెళ్లి కాని ప్రసాద్‌లకు, అమ్మాయిలకు ఈ పరిహారం బాగా పనికొస్తుందట..!

Hartalika Teej 2022 Date: మీకు పెళ్లి అవ్వటం లేదా, మీ జాతకంలో ఏమైనా దోషాలున్నాయా, మీ భార్యభర్తల మధ్య గొడవలున్నాయా... హర్తాళికా తీజ్ రోజున ఈ పరిహారాలు చేయండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 28, 2022, 12:18 PM IST
Marriage Problems: పెళ్లి కాని ప్రసాద్‌లకు, అమ్మాయిలకు ఈ పరిహారం బాగా పనికొస్తుందట..!

Hartalika Teej 2022 Date: ప్రస్తుతం చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లి వయసు దాటినా వివాహం చేసుకోవట్లేదు. ఏమైనా అంటే కెరీర్ లో సెటిల్ అవ్వాలి, జాతకంలో దోషం ఉంది, అప్పుడే పెళ్లింటి అనే రకరకాల కారణాలు చెప్తూ వివాహాన్ని వాయిదా వేస్తున్నారు. ఒక్కోసారి అబ్బాయికి నచ్చిన అమ్మాయి దొరక్కో, యువతికి కోరుకున్న యువకుడు దొరక్కో పెళ్లి చేసుకోవట్లేదు. మీకు కూడా ఇలా జరిగితే హర్తాళికా తీజ్ (Hartalika Teej 2022) పండుగ నాడు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. పెళ్లైన జంటల మధ్య బంధం బలపడాలంటే ఈ రోజున ఉపవాసం ఉండండి. 

ఈ పరిహారాలు చేయండి
>> పెళ్లి వరకు వచ్చి ఆగిపోయినా, సంబంధం పదే పదే చెడిపోతున్నా.. అలాంటి వారు హర్తాళికా తీజ్ రోజున నిర్జల ఉపవాసం చేయండి. పసుపు బట్టలు ధరించి, శివలింగానికి తెల్లటి చందనం పూయండి. దీంతోపాటు పార్వతీదేవికి కుంకుమ సమర్పించండి. అనంతరం 'ఓం పార్వతీపతయే నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. తల్లికి సమర్పించిన ఆ కుంకుమను మీ దగ్గర ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల మీ వివాహ సమస్య పరిష్కారమవుతుంది. 
>> ఒక్కోసారి భార్యాభర్తల మధ్య సమన్వయం లోపించడం వల్ల ఎన్నో గొడవలు జరుగుతుంటాయి. వారి బంధం బలపడాలంటే.. హర్తాళికా తీజ్ రోజున నిర్జలా ఉపవాసం ఉండి.. శివుని ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి. ఆలయంలో నాలుగు ముఖాల దీపాన్ని వెలిగించడం మర్చిపోవద్దు. అంతేకాకుండా దేవుడికి కుంకుమ, ఎరుపు గాజులను సమర్పించండి. దీనితో పాటు "నమః శివాయ" అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. 

Also Read: Vinayaka Chavithi 2022: వినాయక చవితి ఎప్పుడు, విశిష్టత, పూజా విధానం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News