Budhaditya Yoga: మరోసారి బుధాదిత్య యోగం ఏర్పాటు..డిసెంబర్ 13 నుంచి లగ్జరీ లైఫ్‌ ప్రారంభం!

Budhaditya Yog In December 2023: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధాదిత్య యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలతో పాటు అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2023, 05:01 PM IST
 Budhaditya Yoga: మరోసారి బుధాదిత్య యోగం ఏర్పాటు..డిసెంబర్ 13 నుంచి లగ్జరీ లైఫ్‌ ప్రారంభం!

 

Budhaditya Yog In December 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత రాశి సంచారం చేస్తాయి. ఇలాంటి ప్రక్రియ జరిగినప్పుడు మొత్తం 12 రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అయితే ఈ సంచారం జాతకాల్లో గ్రహాల స్థితుల బట్టి ఆధారపడి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధుడు డిసెంబర్ 13న ధనుస్సు రాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. డిసెంబర్ 28 వరకు ధనుస్సు రాశిలో తిరోగమనంలోన స్థానంలో ఉండబోతున్నాడు. ఇదే సమయంలో డిసెంబర్ 16న గ్రహాల రాజైన సూర్యుడు కూడా ధనుస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జాతకంలో బుధాదిత్య దిత్య యోగం ఏర్పడం వల్ల సంపద పెరగడమే కాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అయితే ఈ యోగం కారణంగా ఏయే రాశులవారిపై ఎఫెక్ట్ పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
మేష రాశి:

బుధాదిత్య యోగం వల్ల మేష రాశివారి వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. కొత్త పనులు ప్రారంభించాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఆర్థికంగా కూడా భారీ లాభాలు పొందుతారు. దీంతో పాటు కెరీర్‌లో ఎదుగుదలకు అనేక అవకాశాలు కలుగుతాయి. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

కర్కాటక రాశి :
బుధాదిత్య యోగం కారణంగా కర్కాటక రాశి వారు ఉద్యోగ, వ్యాపారాలలో ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా పూర్వీకుల ఆస్తి నుంచి భారీ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా సంపాదన కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు కొత్త ఆదాయ వనరుల నుంచి మంచి ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు కుటుంబంలో శాంతి వాతావరణం నెలకొంటుంది. 

తుల రాశి:
డిసెంబర్ 16న ఏర్పడే బుధాదిత్య యోగం కారణంగా తుల రాశివారికి వృత్తి పరంగా ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. ఇక ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. దీంతో పాటు డబ్బు సంబంధిత సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో ఆనందంతో పాటు శాంతి నెలకొంటుంది. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News